![]() |
![]() |

హీరోలకే కాదు హీరోయిన్స్ కి కూడా లాంగ్ రన్ ఉంటుందని నిరూపించిన అతి కొద్దీ మంది హీరోయిన్స్ లో నయనతార (nayanthara)కూడా ఒకటి. ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులో కూడా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద తనదైన హవాని కొనసాగిస్తు వస్తుంది. లేటెస్ట్ గా వచ్చి సూపర్ డూపర్ హిట్ ని అందుకున్న జవాన్ మూవీనే అందుకు ఉదాహరణ. ఇక నయన్ తాజాగా ఒక కొత్త సంచలనానికి తెరలేపబోతుందనే వార్తలు ఇండియన్ సినీ పరిశ్రమని షేక్ చేస్తున్నాయి.
ప్రస్తుతం నయన్ చాలా సెలెక్టివ్ గా సినిమాలని ప్లాన్ చేసుకుంటుంది. వచ్చిన ప్రతి సినిమాని చెయ్యడం లేదు. దీంతో అభిమానులు నయన్ కొత్త సినిమాల గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక వార్త వాళ్ళని షాక్ కి గురి చేస్తుంది. తమిళ బిగ్ బాస్ ఫేం కెవిన్(kavin)హీరోగా ఒక నూతన చిత్రం తెరకెక్కబోతుంది. ఇందులో నయన్ నటించబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ లో ఏముంది నయన్ ఖాతాలో ఇంకో సినిమా చేరిందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నయన్ ఈ మూవీలో కెవిన్ కంటే వయసులో పెద్దదిగా కనపడబోతుందని అంటున్నారు. అంతే కాకుండా తనంతట తానుగా కెవిన్ ను ప్రేమించే క్యారక్టర్ లో నయన్ రెచ్చిపోయి నటించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ వార్త నిజమైతే కనుక నయన్ నూటికి నూరు శాతం ఒక పెను సంచలనం సృష్టించినట్టే అవుతుంది. ఇక ఫ్యాన్స్ అయితే నయన్ నటన ఏ రేంజ్ లో ఉండబోతుందో అంటు ఇప్పటినుంచే అంచనాలు వేసుకుంటున్నారు. పైగా ఈ మూవీకి ఉన్న స్పెషల్ ఏంటంటే నయన్ భర్త విఘ్నేష్ శివన్(vignesh shivan) నే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుండగా విష్ణు ఇడవన్ (vihsnu idavan)దర్శకుడు. ఆయనకిదే తొలి సినిమా.
![]() |
![]() |