![]() |
![]() |

రాజ్ తరుణ్(raj tarun)లావణ్య(lavanya)కేసు విషయంలో ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)స్టామినా ఏమిటో మరోసారి అందరకి అర్ధమయ్యింది. అదేంటి ఆ కేసుకి పవన్ కి సంబంధం ఏంటి? పవన్ ఇప్పుడు డిప్యూటీ సిఎం తో పాటు పంచాయితీ రాజ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు.పైగా వాటికి సంబంధించిన పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకు సంబంధించిన వార్తలని రోజు చూస్తూనే ఉన్నాం కదా అని అనుకుంటున్నారా! మీరు అనుకునేది నిజమే. నేను చెప్పబోయేది కూడా నిజమే.
తాజాగా లావణ్య ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అందులో మాట్లాడుతు దేవుళ్లలో శివుడు(sividu)అంటే నాకు చాలా ఇష్టం. అలాగే మనుషుల్లో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం.పవన్ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. అలాగే కారు వెనుక పవన్ స్టిక్కర్ కూడా ఉంటుంది. పవన్ అంటే అంత ప్రేమ. దీంతో నా కేసుని ఆయన దగ్గరకి తీసుకెళ్లాలని అనుకుంటున్నానని చెప్పింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అదే విధంగా పవన్ మీద ఇంకొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. పవన్ రెండు పెళ్లిళ్లు చేసుకొని విడిపోయాడు. కానీ కలిసి ఉన్నపుడు వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా గౌరవంగానే చూసుకున్నారు .కానీ రాజ్ తరుణ్ అలా కాదు. నాకు కనీసం తినడానికి తిండి కి కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పుకొచ్చింది.
ఏది ఏమైనా లావణ్య విషయంలో రాజ్ తరుణ్ చేసింది చాలా దారుణం అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మరి లావణ్య నిజంగానే పవన్ ని సంప్రదిస్తుందేమో చూడాలి. రాజ్ తరుణ్ మీద అయితే ప్రస్తుతానికి పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యి ఉంది.
![]() |
![]() |