![]() |
![]() |
.webp)
ఖాళీ టైం లో సినిమాకి సంబంధించిన న్యూస్ ని చూద్దామనుకున్నాం. అనుకున్నదే తడువుగా మనకి అందుబాటులో ఉన్న సాధనాల ద్వారా చూస్తున్నాం. ఆ ప్రాసెస్ లో కొంత మంది హీరోయిన్ల గురించి న్యూస్ లో ఉంది. అవి ఎలాంటి కిక్ ని ఇవ్వడం లేదు. కానీ ఆ తర్వాత ఒక హీరోయిన్ కి సంబంధించిన వార్త కనపడింది.ఇది కదా కిక్ అనుకోని ఎంతో ఇంట్రెస్ట్ గా ఆ న్యూస్ చదువుతాం. అలాంటి ఇంట్రెస్ట్ ని కలిగించే హీరోయిన్ ఎవరో కాదు సాయి పల్లవి(sai pallavi)ఇప్పుడు ఈమెకి సంబంధించిన తాజా న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంతే కాకుండా సదరు వార్త ఆమె అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఏకకాలంలో తీసుకొస్తుంది.
ప్రతి ఆర్టిస్ట్ కి ఒక డ్రీం రోల్ ఉంటుంది. అదే విధంగా సాయి పల్లవి కూడా ఒక డ్రీం రోల్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది. అదే విషయాన్నీ ఒక యాంకర్ సాయి పల్లవిని అడిగింది. దాంతో నాకు కామిక్ రోల్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. కామిక్ రోల్స్ అంటే కామెడీ ని పండించడం. నేను ఎట్ లీస్ట్ ఒక్క సినిమాలో అయినా పూర్తి స్థాయి కమెడియన్ గా ప్రేక్షకులని నవ్వించాలి. ఎందుకంటే ప్రేక్షకులు నన్ను హీరోయిన్ గానే కాకుండా లేడీ కమెడియన్ గా గుర్తించాలి. అదే నా డ్రీం రోల్ అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ మాటలని విన్న అభిమానులు సాయి పల్లవి కామెడి రోల్ లో నటిస్తే చూడాలని అనుకుంటున్నారు. పైగా ఆ క్యారక్టర్ లో ప్రేక్షకులని మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. గతంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదాలో కొంతసేపే అయినా కూడా కామెడీ బాగా చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
ఇక ఇప్పుడు ఎలాగు తన మనసులో ఉన్న విషయాన్ని సాయి పల్లవి బయట పెట్టింది కాబట్టి మేకర్స్ ఆ దిశగా ఆలోచించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం లేడీ మెగాస్టార్ హోదాలో కొనసాగుతు ఉంది. నాగ చైతన్య (naga chaitanya) హీరోగా వస్తున్న తండేల్ (thandel)తో పాటు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక రామాయణం(ramayanam)లో సీతగా చేస్తుంది. అందుకు సంబంధించిన కొన్ని పిక్స్ ఇటీవల బయటకి వచ్చాయి. సీతగా సాయి పల్లవి పర్ఫెక్ట్ గా సూటయ్యిందనే కితాబు ని అందుకుంది. రాముడుగా రణబీర్(ranbir)చేస్తున్నాడు.
![]() |
![]() |