![]() |
![]() |

అసలు ఏం జరిగింది.. ఏం జరుగుతుంది.. ఏం జరగబోతుంది.. ఇప్పుడు ఈ డైలాగ్ అశేష సినీ ప్రేమికుల నోటి వెంట వినిపిస్తుంది. ఇందుకు కారణం ప్రముఖ యువ హీరో కిరణ్ అబ్బవరం(kiran abbavaram)అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం.
కిరణ్ అబ్బవరం తాజాగా తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసాడు. లెట్స్ బిగిన్ ఫ్రం టుమారో అని చేసాడు. దానికి తెలుగు అర్ధం రేపటి నుండి మొదలు పెడదాం. కిరణ్ ఇప్పుడు ఈ ట్వీట్ ఎందుకు చేసాడో అని అందరు మాట్లాడుకుంటున్నారు. కేవలం ఆ ఒక్క లైన్ తప్పించి ఇంకెలాంటి వర్డ్స్ ని ఉపయోగించలేదు. కొత్త సినిమా గురించి రేపు చెప్తాడేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొంత మంది అయితే పెళ్లి పనులు ఏమైనా మొదలవుతున్నాయా అంటు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి కిరణ్ అయితే ఏ ఉద్దేశ్యంతో చేసాడో గాని సినీ సర్కిల్స్ లో మాత్రం ఆ ట్వీట్ వైరల్ అవుతుంది.
కెరీర్ పరంగా చూసుకుంటే ప్రస్తుతం వరుస ప్లాప్ లతో ఉన్నాడు. ఎన్నో ఆశలతో చేసిన ప్రతి సినిమా కూడా ఫెయిల్ అవుతు వస్తుంది.2019 లో రాజా వారు రాణి వారు తో సినీ రంగ ప్రవేశం చేసాడు.ఎస్ ఆర్ కల్యాణ మండపం, సెబాస్టియన్, సమ్మతమే,నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్ లాంటి సినిమాలు ఇప్పటి వరకు వచ్చాయి. ఎస్ఆర్ కల్యాణ మండపం ఒక్కటే సో సో గా ఆడింది.
![]() |
![]() |