Home

»

Latest News

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్టర్ ఇతనే.. బాలయ్య షాకింగ్ డెసిషన్!

Jul 2, 2024 3:53PM

నందమూరి అభిమానుల ఎదురుచూపులు ఫలించబోతున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తనయుడు మోక్షజ్ఞ (Nandamuri Mokshagna) త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఈ పిక్ లో మోక్షజ్ఞ లుక్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో స్టార్ రాబోతున్నాడంటూ అభిమానులు సంబరపడుతున్నారు. అదే సమయంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ బాధ్యతను బాలకృష్ణ ఏ దర్శకుడికి అప్పగిస్తాడనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే బాలయ్య ఓ సంచలన దర్శకుడికి ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలుస్తోంది.

'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి సినిమాలతో ప్రతిభగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ (Prasanth Varma).. 'హ‌నుమాన్'తో సంచలనం సృష్టించాడని చెప్పవచ్చు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి.. ప్రశాంత్ పేరు మారుమోగేలా చేసింది. అందుకే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ డైరెక్ట్ చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మకి బాలకృష్ణ అప్పగించారని సమాచారం.

ప్రశాంత్ వర్మ, బాలకృష్ణ మధ్య అనుబంధం ఉంది. బాలయ్య హోస్ట్ చేసిన 'అన్ స్టాపబుల్' షో ప్రోమోలను ప్రశాంత్ అద్భుతంగా రూపొందించి ఆకట్టుకున్నాడు. ప్రశాంత్ వర్క్ తో ఇంప్రెస్ అయిన బాలయ్య.. భవిష్యత్ లో అతనితో సినిమా చేస్తానని కూడా మాటిచ్చాడు. అయితే ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన తన కుమారుడు మోక్షజ్ఞ డెబ్యూ ప్రాజెక్ట్ బాధ్యతను ప్రశాంత్ కి అప్పగించాడనే వార్త ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే మోక్షజ్ఞ కోసం ప్రశాంత్ వర్మ ఒక కథను సిద్ధం చేసి వినిపించగా.. బాలకృష్ణకు ఎంతగానో నచ్చిందట. మోక్షజ్ఞ సైతం ఇంప్రెస్ అయ్యాడట. ఈ ప్రాజెక్ట్ లాక్ అయినట్లేనని, మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 6న ఘనంగా లాంచ్ అయ్యే అవకాశముందని అంటున్నారు.

కాగా, ప్రశాంత్ వర్మ తన పేరుతో సినిమాటిక్ యూనివర్స్ ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్'లో భాగంగానే 'హనుమాన్' వచ్చింది. ఇప్పటికే ప్రకటించిన 'అధీర', 'జై హనుమాన్' సినిమాలు కూడా ఈ యూనివర్స్ లో భాగంగానే రానున్నాయి. మరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా ఈ యూనివర్స్ లో భాగమవుతుందా లేదా అనే దానిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com