Home

»

Latest News

ఏఐతో మెగా హీరో లవ్ స్టోరీ!

Jun 30, 2024 1:49PM

విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej).. కొంతకాలంగా వరుస పరాజయాలతో బాగా వెనకబడిపోయాడు. ఎలాగైనా సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ రేసులోకి రావాలి అనుకుంటున్నాడు. అందుకే ఆసక్తికర ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతున్నాడు.

ప్రస్తుతం కరుణ కుమార్ దర్శకత్వంలో 'మట్కా' సినిమా చేస్తున్న వరుణ్ తేజ్.. డైరెక్టర్ మేర్లపాక గాంధీతోనూ ఒక సినిమా కమిటై ఉన్నాడు. అలాగే 'టచ్ చేసి చూడు' ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ అని సమాచారం. కథ కొత్తగా ఉంటుందట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్వర్క్ జరుగుతోందని వినికిడి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com