![]() |
![]() |
.webp)
ఇండియన్ సినీ సీమకి అతిలోక సుందరి ఎవరు అని అడిగితే శ్రీదేవి(sridevi)అని చెప్తారు. ఇప్పుడు ఆ ప్లేస్ ని భర్తీ చెయ్యడానికి వస్తుంది శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్(janhvi kapoor)2018 లో ధడక్ తో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ ఇప్పటి వరకు సుమారు పది సినిమాలు దాకా చేసింది. సినిమా ఫలితం ఎలా ఉన్న కూడా తల్లికి తగ్గ తనయ అని అనిపించుకుంది. తాజాగా ఆమెకి సంబంధించిన ఒక మూవీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
జాన్వీ ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలే మిస్టర్ అండ్ మిస్సెస్ తో వచ్చి హిట్ కొట్టింది.అందులో ఆమె నటనకి మంచి పేరు కూడా వచ్చింది. దీంతో మరింత ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఉలజ్(ulajh)అనే మూవీ చేస్తుంది.తనే టైటిల్ రోల్ పోషిస్తుంది. అంటే తనే హీరో. పైగా ఇది రెగ్యులర్ మూవీ కాదు. స్ప్రై థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇటీవలే షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ మూవీ కథ పలువురిని ఆకర్షిస్తుంది. దేశ భక్తుల కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి అనుకోకుండా దేశ ద్రోహం చేసిందనే ఆరోపణలని ఎదుర్కొంటుంది. దీంతో వాటి నుంచి ఎలా బయటపడిందనేదే కథ.

జాన్వీ తో పాటు రోషన్ మధ్యు, గుల్షన్ దేవయ్య, ఆదిల్ హుస్సేన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వినీత్ జైన్ నిర్మాణ సారథ్యంలో సుధాన్షు సైరా దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక జాన్వీ తెలుగులో ఎన్టీఆర్(ntr) దేవర(devara)లో చేస్తుంది. సెప్టెంబర్ 27 న ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రామ్ చరణ్(ram charan)బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కూడా జాన్వీ నే హీరోయిన్.మరికొన్ని భారీ ప్రాజెక్ట్ లు కూడా చర్చల దశలో ఉన్నాయి.సో రాబోయే రోజుల్లో జాన్వీ ఇండియన్ టాప్ స్టార్ అవ్వడం ఖాయం.శ్రీదేవి అభిమానులు కోరుకునేది కూడా ఇదే.
![]() |
![]() |