![]() |
![]() |

ప్రస్తుతం ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ప్రభాస్ (Prabhas) ఒకరు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే నిర్మాతలకు ముందుగా గుర్తుకొచ్చే పేరు ప్రభాస్. ఆయన బ్రాండ్ తోనే వందల కోట్ల బిజినెస్ జరుగుతుంది. అందుకే ప్రస్తుతం ప్రభాస్ రెమ్యూనరేషన్ రూ.100 కోట్లు నుంచి రూ.150 కోట్ల దాకా ఉంటుంది. అయితే తన తాజా చిత్రం 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) కోసం ప్రభాస్ తీసుకున్న పారితోషికం షాకింగ్ గా మారింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం 'కల్కి'. ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ భారీ అంచనాలతో జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకి ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒక్కో సినిమాకి రూ.150 కోట్ల దాకా తీసుకునే ప్రభాస్.. కల్కి చిత్రానికి మాత్రం రూ.80 కోట్లే పారితోషికం తీసుకున్నాడట.
అప్పట్లో 'బాహుబలి'ని నమ్మి ప్రభాస్ నాలుగేళ్లపాటు ఆ సినిమాకే అంకితమై పని చేశాడు. ఇప్పుడు 'కల్కి'ని అలాగే కూడా నమ్మి.. తన రెమ్యూనరేషన్ ని తగ్గించుకుంటే.. అది మేకింగ్ బడ్జెట్ లో యాడ్ అయ్యి, ఇంకా మెరుగైన అవుట్ పుట్ రావడానికి హెల్ప్ అవుతుందని భావించాడట. ప్రభాస్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం.. కల్కి నిర్మాతలతో పాటు అందరినీ ఆశ్చర్యపరిచిందట.
![]() |
![]() |