![]() |
![]() |

ఒక్కోసారి ఆవేశంతో చేసే పనులు జీవితాలను తలకిందులు చేస్తాయి. కన్నడ హీరో దర్శన్ ముందు వెనుక ఆలోచించకుండా అలాంటి ఘాతుకానికే ఒడిగట్టాడు. తన అభిమానిని కడతేర్చి, జైలుపాలయ్యాడు.
తన అభిమాన హీరో దర్శన్ వ్యక్తిగత జీవితంలో పవిత్రా గౌడ చిచ్చు పెడుతోందంటూ ఆయన వీరాభిమాని రేణుకా స్వామి సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశాడు. అదే అతని ప్రాణాలు పోయేలా చేసింది. రేణుకా స్వామిని దారుణంగా హింసించి హత్య చేశారు.
ఈ కేసులో దర్శన్ సహా 17 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేణుకా స్వామిని హత్య చేయడానికి ముందు.. కరెంట్ షాక్ పెట్టడంతో పాటు, చిత్ర హింసలకు గురిచేశారు. ఈ విషయాలు పోస్టుమార్టుడంలో వెల్లడయ్యాయి. నిందితులు కూడా అంగీకరించారు.
ఇక దర్శన్ పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో సంచలన విషయాన్ని తెలిపాడు. రేణుకా స్వామి మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా మాయం చేయాలని మరో నిందితుడు ప్రదేశ్ కి రూ.30 లక్షలు ఇచ్చినట్లు అంగీకరించాడు. అంతేకాదు, ఈ విషయంలో ఎట్టిపరిస్థితుల్లో తన పేరు బయటకు రాకుండా చూడాలని కోరినట్లు దర్శన్ తెలిపాడు.
![]() |
![]() |