![]() |
![]() |
.webp)
మనం థియేటర్లలో చూడని సినిమాలని కొన్నింటిని ఓటీటీలోకి రాగానా చూడాలనుకుంటాం. అయితే అవి కాస్తైన హిట్ టాక్ వస్తే ఓసారి చూసేయొచ్చు. ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజైన సినిమాలలో సక్సెస్ సాధించినవి తక్కువే. అయితే కొన్ని సినిమాలకి థియేటర్ల వద్ద సరైన హిట్ లభించకపోయిన, మిక్స్ డ్ టాక్ వచ్చిన మేకర్స్ ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు.
థియేటర్లలో రిలీజైన మిశ్రమ స్పందనలని తెచ్చుకున్న రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ ' రసవతి' . అర్జున్ దాస్, తాన్య రవి చంద్రన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ గత నెల మే 10 న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీకి శాంతకుమార్ దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చింది. అయితే ఈ మూవీని ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఈ నెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ , ఆహా, సింప్లీ సౌత్ అనే మూడు ఓటీటీల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ తీసుకొస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సదాశివగా అర్జున్ దాస్, సూర్యగా తాన్య రవిచంద్రన్ నటించారు.
రసవతి మూవీ కథేంటంటే .. కొడైకెనాల్ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఓ గ్రామంలో వైద్యం చేసే సదాశివ అనే యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీలో నిఖిలా శంకర్, దీప, అరుల్ జ్యోతి , రిషి కాంత్, సుజాత శివకుమార్, రమ్య సుబ్రమణియన్ తదితరులు నటించారు. థియేటర్లలో చూడనివారు ఈ రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ ని మిస్ అవ్వకుండా చూసేయ్యండి.
![]() |
![]() |