![]() |
![]() |

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ అధికారిక ప్రకటన వచ్చింది.
సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టి.జి. విశ్వప్రసాద్ నిర్మించనున్నారు. "మాస్ ఫీస్ట్ లోడింగ్" అంటూ ఈ మూవీని ప్రకటించిన మేకర్స్.. "దేశంలోనే అతి పెద్ద యాక్షన్ చిత్రాన్ని చూడటానికి సిద్ధమవ్వండి" అని తెలిపారు. సినీ ప్రముఖుల సమక్షంలో గురువారం ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. జూన్ 22 నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

రెజీనా కాసాండ్రా, సయామీ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రిషి పంజాబీ, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |