![]() |
![]() |
.webp)
స్వశక్తి తో తన కంటు ఫ్యాన్ బేస్ ని, ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిన నటుడు విశ్వక్ సేన్(vishwak sen)నందమూరి నటసింహం బాలకృష్ణ (balakrishna)నోటితోనే ఒక తల్లి కడుపున పుట్టక పోయినా విశ్వక్ నా తమ్ముడు అనే స్థాయికి కూడా ఎదిగాడు.మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో వచ్చి తన సత్తా చాటాడు. ఇక లేటెస్ట్ గా కల్కి 2898 ఏడీ గురించి విశ్వక్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas)కల్కి (kalki)ట్రైలర్ జూన్ పది న పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. బాహుబలి తో ఇండియన్ హీరోగా ఎదిగిన మా ప్రభాస్ కల్కి తో వరల్డ్ హీరో అవ్వడం ఖాయమనే మూడ్ లో ఉన్నారు. అదే టైం లో కల్కి ట్రైలర్ చూస్తుంటే గతంలో వచ్చిన ఎన్నో హాలీవుడ్ సినిమాలు గుర్తుకొస్తున్నాయని, వాటిని కాపీ కొట్టారనే మాటలు కూడా వస్తున్నాయి. బార్బెల్ అనే వ్యక్తి కల్కి ట్రైలర్ హాలీవుడ్ నుంచి రిఫరెన్సులు తీసుకుని చేసినట్టుగా ఉందంటు ఇనిస్టాగ్రమ్ వేదికగా ఒక వీడియో చేసాడు.ఇప్పుడు దీని మీదే విశ్వక్ తనదైన శైలిలో ఇచ్చిపడేసాడు. సినిమా రిలీజ్ అవ్వకముందే చెంబు పట్టుకుని బయల్దేరుతున్నారు. యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బుకోసం వేల మంది కష్టపడి పని చేస్తున్న సినిమా ఇండస్ట్రీతో మజాక్‌లు చేస్తున్నారు. బార్బల్ గాడు ఒక పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తియ్యగలడేమో చూద్దాం. లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్లు అనుకుని ఇగ్నోర్ చేద్దాం.
మన చుట్టూ ఉన్న కొంత మంది పైరసీ కంటే డేంజర్.. సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం, చెమటను, ఎంతో మందికి జోవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. తన ఇన్ స్టా స్టోరీలో బార్బల్ వీడియో అప్ లోడ్ చేసి మరి ఫైర్ అయ్యాడు. ఇక జూన్ 27 న రిలీజ్ అవుతున్న కల్కి కోసం వరల్డ్ మొత్తం ఎదురుచూస్తుంది. ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. క్షణమొక యుగంలా గడుపుతున్నారు. కాకపోతే రిలీజ్ టైం దగ్గరపడే కొద్దీ తెలుగునాట ప్రమోషన్స్ లో వేగం పెరగడం లేదనే వాదన ఒకటి వినపడుతుంది. ప్రస్తుతానికి బైరవ డార్లింగ్ బుజ్జి ముంబై, చెన్నై రోడ్ల మీద తిరుగుతుంది. ప్రభాస్ నేమ్ భైరవ అనే విషయం అందరకి తెలిసిందే. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలోనే అంగరంగ వైభవంగా జరగనుంది.భారతీయ చిత్ర పరిశ్రమకి చెందిన అతిరథ మహారధులు అందులో పాల్గొనబోతున్నారు. అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశాపటాని, రాజేంద్ర ప్రసాద్ వంటి మేటి నటులు కల్కి లో భాగస్వామ్యం అయ్యారు. నాగ్ అశ్విన్ దర్శకుడు కాగా వైజయంతి మూవీస్ పై అశ్వనిదత్ నిర్మించాడు.
![]() |
![]() |