![]() |
![]() |

ఆహా ఏమి భాగ్యము ఏమి భాగ్యము. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)అభిమానులది ఏమి భాగ్యము. ఇంకా చెప్పాలంటే వాళ్ళ జన్మ ధన్యం అయిపోందంటే నమ్మండి.పైగా మొట్టమొదటిసారిగా నిజాయితీ తో కూడిన ఆనంద బాష్పాలకి అర్ధం ఏంటో తెలిసొచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏంటో చూద్దాం.
మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నూటికి నూరు శాతం ఫలితాన్ని సాధించాడు. పైగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాస్త్ర, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా బాధ్యతలు చెప్పట్టాడు. ఇప్పుడు ఈ బాధ్యతలకి సంబంధించిన నేమ్ బోర్డు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అది చూసిన పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అదే పనిగా బోర్డు ని చూస్తూ మురిసిపోతున్నారు.
.webp)
ఇక అదే విధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(nara chandrababu naidu) గారు పవన్ కి ఉప ముఖ్యమంత్రి తో పాటు కీలకమైన పదవులు ఇచ్చి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటు తన బాధ్యతలని పవన్ సక్రమంగా నిర్వర్తించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే రాష్టాభివృద్దికి కూడా తోడ్పాటు ని అందించి మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆశ పడుతున్నారు.
![]() |
![]() |