![]() |
![]() |
విజయ్ మాల్యా పేరు వినగానే ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయి విదేశాల్లో దాక్కున్నాడన్నదే గుర్తొస్తుంది. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా విజయ్ మాల్యా ఇంట్లో పెళ్ళి వాతావరణం నెలకొంది. విజయ్ మాల్యా కుమారుడు సిద్ధార్థ మాల్యా పెళ్లి పీటలెక్కబోతున్నాడు. అమెరికాకు చెందిన జాస్మిన్‌తో సిద్ధార్థ పెళ్లి జరగనుంది. ఈ విషయాన్ని సిద్ధార్థ, జాస్మిన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన ప్రేయసికి ఉంగరం తొడిగి ప్రపోజ్ చేస్తోన్న ఫొటోని షేర్ చేశాడు సిద్ధార్థ్ మాల్యా. ఇక ఈ వారంలోనే వీళ్లిద్దరి వివాహం జరగనుంది. ఈ పెళ్ళి భారీగా జరుగుతుందా లేక కుటుంబసభ్యుల సమక్షంలో జరుగుతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ పెళ్లికి విజయ్ మాల్యా హాజరవుతారా లేక విదేశాల్లోనే తలదాచుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.
జాస్మిన్ మాజీ మోడల్ అని తెలుస్తోంది. ఇక సిద్ధార్థ కొన్ని సినిమాల్లో నటించడమే కాదు, మోడల్‌గా కూడా పనిచేశాడు. విజయ్ మాల్యా-సమీర త్యాబ్జీ దంపతుల సంతాన సిద్ధార్థ్. కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్‌లో పుట్టి.. లండన్, యూఏఈలో పెరిగాడు. లండన్ రాయల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ స్పీచ్ అండ్ డ్రామా నుంచి డిగ్రీ పుచ్చుకుని.. మోడలింగ్ వైపు అడుగు లేశాడు. ఐపీఎల్ తరఫున ఆర్సీబీ డైరెక్టర్‌గానూ వ్యవహరించిన సిద్ధార్థ్.. ఆ తర్వాత కింగ్‌ఫిషర్ మోడల్స్‌కు జడ్జిగా.. పలువురు హీరోయిన్లతోనూ ఫొటోలకు ఫోజులు ఇచ్చి హాట్ టాపిక్‌గా మారాడు. నటుడిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ వైపు దృష్టి మళ్లించి యువత, చిన్నారుల మానసిక ఆరోగ్యం-అవగాహన అనే అంశం మీద రెండు పుస్తకాలు కూడా రాశాడు.
![]() |
![]() |