![]() |
![]() |
.webp)
ప్రపంచంలో కొన్ని భయంకరమైన సంఘటనలు జరిగాయి. కొంతమంది మేకర్స్ వాటిని సినిమాగా తెరకెక్కించి వాటిని ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారు. వాటికి ఆదరణ కూడా ఎక్కువే. గతేడాది నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సినిమా ' సొసైటీ ఆఫ్ ది స్నో'. ఇది తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీకి దర్శకుడు జె.ఏ బయోనా. 96వ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ లో ఉత్తమ విదేశీ(స్పెయిన్) చిత్రంగా ఎంట్రీ దక్కించుకుంది.
1972 లో ఫ్లైట్-571 వాతావరణ పరిస్థితుల మార్పు వల్ల ఆండిస్ పర్వత శ్రేణుల్లో కూలిపోయింది. ఆ ఫ్లైట్ లో 45 మంది యువ రగ్బీ టీమ్ ఉంది. వారందరు ఉరుగ్వే నుండి టోర్నమెంట్ కోసం చిలీలోని శాంటియాగోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరుగుతుంది. ఎవరు ఊహించని విధంగా కొంతమంది అక్కడికక్కడే మరణించగా మరికొందరు ప్రాణాలతో పోరాడుతుంటారు. చుట్టూ ఎత్తైన మంచు పర్వతాలు ఉండటం వల్ల అక్కడ మైనస్ 20 డిగ్రీలకు పైగా చలి ఉంటుంది. టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో వాళ్ళు ఎలా భయటపడ్డారు? ఎంత మంది ప్రాణాలతో ఉన్నారు? వాళ్ళు అక్కడ తీసుకున్న ఆహారం ఏంటనేది మిగతా కథ.
సినిమాల్లో వచ్చే సస్పెన్స్, థ్రిల్, ట్విస్ట్ లు అంటే అందరికి నచ్చేస్తాయి. అయితే సర్వైవల్ థ్రిల్లర్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందులో యథార్థ సంఘటనల ఆధారంగా తీసిన వాటికి మరింత క్రేజ్ ఉంటుంది. 'సొసైటీ ఆఫ్ ది స్నో' మూవీలో నలభై అయిదు మంది రగ్బీ ప్లేయర్స్ రెండు నెలల పాటు ఆ మంచు పర్వతాల్లో ఎలా ప్రాణాలతో ఉన్నారో తెలియజేయడంలో దర్శకుడు జె.ఎ. బయోనా సక్సెస్ అయ్యాడు. చావు బతుకల మధ్య పోరాడుతున్నవారికి ఆత్మస్థైర్యం మించిన బలం ఏమీ లేదని స్పూర్తిని నింపే ఈ సినిమా ప్రతీ ఒక్కరికి నచ్చేస్తుంది. ముఖ్యంగా వారు బ్రతకాలంటే ఆహారం కావాలి. కానీ చుట్టూ మంచు పర్వతాలు. ఆ సమయంలో వాళ్ళేం చేశారో స్క్రీన్ మీద చూస్తే ప్రతీ ఒక్కరికి కన్నీళ్ళు రాకుండా ఉండవు. సినిమా మొదట్లో జరిగే విమాన ప్రమాదాన్ని చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ప్రాణాలతో పోరాడుతున్న వారిని చూసే ప్రేక్షకుడి గుండె బరువెక్కుతుంది. అయితే సినిమా కథ నెమ్మదిగా సాగుతుంది. కాస్త ఓపికగా చూస్తే భావోద్వేగంతో చలించిపోతారు. నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో అందుబాటులో ఉన్న ఈ హాలివుడ్ మూవీని ఓ సారి చూసేయ్యండి.
![]() |
![]() |