![]() |
![]() |

ఒకేసారి సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ రాణించేవారు అరుదుగా ఉంటారు. అలా అరుదైన వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు. కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఆయన.. సినిమాల్లోనూ నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే నాయకుడిగా ఇప్పుడు పవన్ బాధ్యత మరింత పెరిగింది. ఎందుకంటే ఇప్పుడాయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. అలాగే పలు కీలక మంత్రిత్వ శాఖలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఈ క్రమంలో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తన మొదటి ప్రాధాన్యత రాజకీయాలే అని పవన్ కళ్యాణ్ ముందు నుంచి చెబుతున్నారు. దానికి తోడు కీలక పదవులు కూడా దక్కడంతో.. ఇక తన పూర్తి సమయాన్ని ప్రజా సేవకే కేటాయించాలని పవన్ భావిస్తున్నారట. ప్రస్తుతం పవన్ చేతిలో 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హర వీరమల్లు' వంటి సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల మెజారిటీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. పెండింగ్ షూటింగ్ కి కూడా కొన్నిరోజులు కేటాయించి.. వీలైనంత త్వరగా చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి.. ఇక నటనకు గుడ్ బై చెప్పాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
![]() |
![]() |