![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఇండియాలో ఇంతకు ముందు ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. దీంతో సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోను సరికొత్త రికార్డులు సృష్టించగలనని చెప్పినట్టు అయ్యింది. ఇక పవన్ విజయం పట్ల ఆయన అభిమానులే కాదు కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. ముఖ్యంగా చిరు(chiranjeevi)అండ్ సురేఖ ల ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేం. తాజాగా పవన్ కి సురేఖ(surekha) ఇచ్చిన గిఫ్ట్ ఒకటి టాక్ అఫ్ ది డే గా నిలిచింది.
పవన్ కళ్యాణ్ కి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సిఎంతో పాటుగా పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాబివృద్ధి మంత్రిగా బాధత్యల్ని నిర్వహించబోతున్నాడు.దీంతో తెలుగుప్రజల ఆకాంక్షల్ని నిజం చెయ్యాలని కోరుకుంటు సురేఖ ఒక పెన్ ని పవన్ కి గిఫ్ట్ గా ఇచ్చింది. పెన్ కూడా ప్రత్యేక ఆకర్షణీయతో చూపరులని కట్టి పడేస్తుంది. ఆ పెన్ రేట్ అక్షరాలా రెండు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల రూపాయిలు. సో పవన్ తన శాఖకి సంబంధించిన అన్ని ఫైల్స్ మీద తన వదిన ఇచ్చిన పెన్ తోనే సంతకాలు చేయనున్నాడు. పెన్ వీడియో సోషల్ మీడియాలో అలా అప్ లోడ్ అయ్యిందో లేదో రికార్డు స్థాయిలో వ్యూస్ ని సంపాదిస్తుంది. అందులో చిరంజీవి, పవన్ సతీమణి అన్నా లెజినోవా కూడా ఉన్నారు.
ఇక పవన్, సురేఖ లు వదిన,మరిది గా కాకుండా .తల్లి కొడుకుల్లా ఉంటారు. పవన్ గెలిచి చిరు ఇంటికి వచ్చినప్పుడు కూడా సురేఖ కి కృతజ్నతగా తన తలని ఆమె పాదాల దగ్గర ఉంచి మరి ఆశీర్వాదం తీసుకున్నాడు. దాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు పవన్ జీవితంలో ఆమె పాత్ర చాలా ముఖ్యమని. నెను సినిమాల్లోకి రావడానికి కారణం మా వదిన సురేఖ అని చాలా సందర్భాల్లో పవన్ చెప్పాడు.
![]() |
![]() |