![]() |
![]() |
.webp)
తెలుగు సినిమాకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి(ss rajamouli).స్టూడెంట్ నంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ దాకా అపజయం అనేదే ఎరుగడు. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇది ఒక అరుదైన రికార్డుగా భావించవచ్చు. లేటెస్ట్ గా ఆయన పిక్ ఒకటి యూట్యూబ్ ని షేక్ చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు అనే టౌన్ లో దీప్తి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అని ఉంది. అందులోనే రాజమౌళి చదువుకున్నారు. ఈ విషయం ఎలా బయటకి వచ్చిందంటే దీప్తి స్కూల్ దగ్గర రాజమౌళి దిగిన పిక్ సోషల్ మీడియాలో ఉంది. దీంతో రాజమౌళి తెలివి తేటలకి దీప్తి హై స్కూల్ కారణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు అనే దాంట్లోనూ నిజం లేకపోలేదు. చిన్న వయసులో నేర్చుకున్న పాఠాలే జీవితంలో ఒక వ్యక్తిని ఉన్నత లక్ష్యం వైపు ఎదిగేలా చేస్తాయి.కొవ్వూరు ఆయన సొంత ఊరు అనే విషయం అందరకి తెలిసిన విషయమే.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక మూవీ చెయ్యబోతున్నాడు. ఈ మూవీ మీద జక్కన్న, మహేష్ అభిమానులతో ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జట్ తో నిర్మాణం జరుపుకోనుంది. అతి త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది.
![]() |
![]() |