![]() |
![]() |

సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న హీరో చార్మింగ్ స్టార్ శర్వానంద్(sharwanand)అదేంటి కొత్తగా చార్మింగ్ స్టార్ అంటున్నారేంటని అనుకుంటున్నారా! ఇక నుంచి శర్వానంద్ చార్మింగ్ స్టార్ హోదాలో కొనసాగనున్నాడు. ఈ బిరుదుని ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ప్రకటించాడు. ఇక లేటెస్ట్ గా శర్వా చేసిన కొన్ని వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
మనమే(manamey)..శర్వా నయా మూవీ.ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. అందులో శర్వా మాట్లాడుతు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణ గారికి ,పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు చాలా కష్టపడి ఆ విజయాన్ని దక్కించుకున్నారు.ఇదంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమాకి పండగ వాతావరణం వచ్చినట్లయ్యింది. అదే విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పిఠాపురం లో నిర్వహిద్దామని అనుకున్నాం. కానీ పర్మిషన్ ఇవ్వలేదు. సక్సెస్ మీట్ అయినా అక్కడ నిర్వహిస్తామని చెప్పాడు.
.webp)
మనమే అన్ని వర్గాల ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుంది. రేపు థియేటర్స్ లో చివరి నలభై నిముషాలు ఒక కొత్త అనుభూతికి లోనవ్వుతారని చెప్పాడు. పీపుల్స్ మీడియా పై విశ్వ ప్రసాద్ మనమే ని నిర్మించాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి (kriti shetty) హీరోయిన్ గా చేస్తుంది. రాహుల్ రామకృష్ణ, సీరత్ కపూర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ రామ్ ఆదిత్య దర్శకుడు కాగా హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ ని అందించాడు. ఈ నెల 7 న విడుదల కానుంది.
![]() |
![]() |