Home

»

Latest News

జనసేన జానీ మాస్టర్ పై పోలీసు కేసు

Jun 6, 2024 9:50AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan) హీరోగా వచ్చిన మూవీ ఎవడు. స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు. అందులో  ఫ్రీడం అనే సాంగ్ చరణ్ మీద చిత్రీకరణ జరుపుకుంది. చరణ్ వేసే స్టెప్ లకి మంచి పేరు వచ్చింది. ఆ సాంగ్ ద్వారా పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (jani master)ఆ తర్వాత ఎంతో మంది అగ్ర హీరోలకి వాంటెడ్ డాన్స్  మాస్టర్ గా మారాడు. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో మొన్న జరిగిన ఎలక్షన్స్ కి ముందు జనసేన పార్టీలో చేరి పార్టీ విజయానికి ప్రచారం చేసాడు. తాజాగా ఆయన మీద పోలీసు కేసు నమోదు అయ్యింది.

జానీ మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడు గా ఉన్నాడు. అందులో సతీష్ అనే డాన్సర్ మెంబర్ గా ఉన్నాడు. ఇప్పుడు అతనే జానీ మాస్టర్ మీద పోలీసులకి  ఫిర్యాదు చేసాడు. నాలుగు నెలల నుంచి తనని షూటింగ్స్ కి పిలవడంలేదని, తనకి వర్క్ చెప్పిన  కో ఆర్డినేటర్స్ ని సైతం బెదిరిస్తున్నాడని కంప్లైంట్ లో పేర్కొన్నాడు. ఆయన ఆలా చెయ్యడం వాళ్ళ ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పరిధి  రాయదుర్గం పిఎస్ లో కేసు నమోదు అయ్యింది.మరి ఇందులో అసలు నిజా నిజాలు ఏంటో జానీ మాస్టర్ నే  చెప్పాలి

పవన్ స్పూర్తితో  ప్రజలకి సేవ చెయ్యడానికే  రాజకీయాల్లోకి వచ్చానని పలు సందర్భాల్లో చెప్పాడు. ఇళయ దళపతి  విజయ్ హీరోగా వచ్చిన వారిసు తో తమిళ చిత్ర రంగ ప్రవేశం కూడా చేసాడు. అందులోని రంజితమే  సాంగ్ కి ఆయన కంపోజ్ చేసిన డాన్స్ మూమెంట్స్ కి వరల్డ్ మొతం ఫిదా అయ్యింది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com