![]() |
![]() |

సినిమా పేరు: నాడు
నటీనటులు: తర్శన్, మహిమ నంబియార్, ఆర్.ఎస్ శివాజీ, సింగంపులి, ఇంబా రవికుమార్, వసంత
ఎడిటింగ్: పోన్ కతిరేశ్
మ్యూజిక్: సి. సత్య
సినిమాటోగ్రఫీ: కె. ఏ శక్తివేల్
నిర్మాతలు: చక్ర ఇతయమని, రాజ్
దర్శకత్వం: ఎమ్. శరవణనన్
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
కథ:
దట్టమైన అడవీ ప్రాంతంలోని కొండ మీద ఓ ఊరు ఉంటుంది. మారి(తర్శన్)తో పాటు కొందరు అక్కడ జీవిస్తుంటారు. అయితే మారి చెల్లి అబుదాకి సమస్య రావడంతో.. అది తట్టుకోలేక తను చెట్టుకు ఉరి వేసుకుంటుంది. ఇక అది గమనించిన మారి తనని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. వారి ఊరికి బస్సు సౌకర్యం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఇక మారి తన చెల్లి అబుదాని హాస్పిటల్ కి తీసుకెళ్ళగానే డాక్టర్ చూసి.. తను చనిపోయిందని కొంత సమయం ముందు తీసుకొస్తే కాపాడేవాళ్ళమని చెప్తాడు. ఇక ఊరివాళ్ళంతా కలిసి వారికి సరైన బస్సు సౌకర్యం గానీ ఊరికి డాక్టర్ గానీ ఎవరు లేరని అందుకే ఇలా చనిపోతున్నారని భావిస్తారు. ఇక వారి ఊరికొచ్చిన బస్సుని వెళ్ళకుండా ఆపేడంతో ఆ ఊరికి కలెక్టర్ వస్తాడు. ఆ ఊరివాసులంతా కలెక్టర్ తో తమ భాదలు చెప్పుకోగా.. అతను వాళ్ళ ఊరికి డాక్టర్ ని పంపిస్తానని.. అయితే డాక్టర్ ఇక్కడ ఉండేలా మీరే వారిని మంచిగా చూసుకోవాలని చెప్తాడు. కొన్ని రోజులకి ఆ ఊరికి డాక్టర్ (మహిమ నంబియార్) వస్తుంది. ఆమె అతి కష్టం మీద వారం రోజులు మాత్రమే అక్కడ ఉండడానికి ఒప్పుకుంటుంది. మారి అతని ఊరివాళ్ళు డాక్టర్ ని ఇంప్రెస్ చేశారా? వారి ఊరిలో అనారోగ్యంతో ఉన్న వారిని డాక్టర్ కాపాడగలిగిందా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
పూర్వం ఊరిలో పాముకాటుకి సరైన వైద్యం అందక చాలామంది చనిపోయారు. ఇప్పటికి కొన్ని అటవీ ప్రాంతాలలో బస్సులు లేవు. సరైన డాక్టర్స్ లేరు. అయితే అలాంటి ఓ ఊరి కథే ఇది. వారి జీవన శైలిని ఓ సినిమాగా తెరకెక్కించిన శరవణన్ సక్సెస్ అయ్యాడు.
కథలో పోరాట సన్నివేశాలు, అశ్లీల పదాలు, రొమాంటిక్ సాంగ్స్, ఎలవేషన్స్ లాంటి వాటి జోలికి పోకుండా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అదే చెప్పాడు. యదార్థ సంఘటనల ఆధారంగా.. ఓ ఊరి ప్రజల బాధలు, కన్నీళ్ళు ఇలా ఏవైతే జరిగాయో వాటినే తెరమీద చూపించారు. అయితే సినిమా నిడివిని కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ఈ కథకి గంటన్నర నిడివి ఆయితే సినిమా ఇంకా బాగుండేది.
ఫ్యామిలీతో కలిసి చూసేలా మేకర్స్ జాగ్రత్తపడ్డారు. అసభ్య పదజాలం వాడలేదు. సినిమాలో పెద్దగా క్యారెక్టర్ల పేర్లు కూడా వినిపించవు.. ఎందుకంటే కథని ప్రేక్షకులకి ఓ ఊరి కథలా చెప్పాలనుకున్నాడు. అలాగే చెప్పాడు. ఐటమ్ సాంగ్స్ గానీ సెలెబ్రిటీలతో పేజీల పేజీల డైలాగ్ లు గానీ లేవు.
కేఏ శక్తివేల్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రకృతి అందాలని చాలా చక్కగా కెమెరాలో బంధించాడు. పోన్ కతిరేశ్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. సి.సత్య సంగీతం బాగుంది. నిర్మాణ విలవలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
మారి పాత్రలో తర్శన్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాడు. నటించాడు అనే దానికంటే ఆ పాత్రలో అతను జీవించాడనే చెప్పాలి. మహిమ నంబియార్ డాక్టర్ గా ఆకట్టుకుంది. ఆర్.ఎస్. శివాజీ, సింగంపులి, ఇంబా రవికుమార్ తమ పాత్రలకి న్యాయం చేశారు.
ఫైనల్ గా..
ఫ్యామిలీతో కలిసి చూసే ఓ ఊరి కథ ఇది.
రేటింగ్: 2.5/5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |