![]() |
![]() |

కలర్ ఫోటో తో మంచి గుర్తింపు పొందిన అచ్చ తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి..కొన్ని రోజుల క్రితం విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన గామి లో కూడా అద్భుతంగా నటించి ప్రేక్షక హృదయాల్ని గెలుచుకుంది. ఆ సినిమాలు ఇచ్చిన విజయంతో ఇప్పుడు తనే ముఖ్య పాత్రని పోషిస్తు ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
యేవమ్.. టైటిల్ చూస్తుంటూనే చాలా వెరైటీ గా ఉంది కదు. ఇందులో చాందిని చౌదరి లేడీ పోలీసు ఆఫీసర్ గా చేస్తుంది. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. రీసెంట్ గా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు మేకర్స్ అధికారకంగా ప్రకటన కూడా చేసారు. ప్రకాశ్ దంతులూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ చాలా కాలం తర్వాత తెలుగులో వస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ అని భావించవచ్చు.

వశిష్ట సింహ, భరత్ రాజ్, అషు రెడ్డి, గోపరాజు రమణ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నవ్‌దీప్ ప్రొడ్యూస్ చేస్తుండగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని కీర్తన శేష్, సాంగ్స్ కి నీలేష్ మందలపు లు కలిసి మ్యూజిక్ ని అందిస్తున్నారు.
![]() |
![]() |