![]() |
![]() |

నీ నవ్వే చాలు చామంతి మాలతీ ప్రేమించా నిన్ను వాసంతి. ఒరిజినల్ ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు పెద్దరికం మూవీలో తన ప్రేయసి ని ఉద్దేశించి పాడతాడు.ఆ రోజుల్లో తెలుగు నాట ఎక్కడ విన్నా ఈ పాటే.సుకన్య (sukanya)జగపతి బాబు ప్రేయసిగా నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది.తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు లో మహేష్ (mahesh babu) తల్లిగా నటించి తన నటనలో సత్తా తగ్గలేదని నిరూపించింది. లేటెస్ట్ గా ఆమెకి సంబంధించిన ఒక విషయం హాట్ టాపిక్ గా నిలిచింది
సుకన్య కూతురు అంటు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో ప్రచారం అవుతుంది.ఫొటోలో ఉన్న అమ్మాయి వయసు సుమారు 18 సంవత్సరాల వయసు దాకా ఉంటుంది. దీంతో చాలా మంది సుకన్య కి అంత పెద్ద కూతురు ఉందా అంటు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఈ విషయంపైనే ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న సుకన్య మాట్లాడింది.నాకు కూతురు లేదు.. పెళ్లి అయిన కొన్ని రోజులకే భర్త నుంచి విడిపోయాను. కానీ నా కూతురు అంటు ప్రచారం చేస్తున్నారు.నా గురించి ఏదో ఒక వార్త రాయడానికే ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు అంటు చెప్పుకొచ్చింది.

అసలు విషయానికి వస్తే సుకన్య కొన్ని రోజుల క్రితం తన ట్విట్టర్ లో ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ పిక్ లో సుకన్య, ఆమె చెల్లెలు, చెల్లెలి కూతురు ఉన్నారు. పైగా పాప తన చెల్లెలి కూతురు అని మెన్షన్ కూడా చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయినే సుకన్య కూతరు గా చెప్తున్నారు. ఇక ఈ వార్తలతో అయితే నాకు ప్రీ పబ్లిసిటీ వస్తుంది పెద్దమ్మ అంటు సుకన్యతో పాప అంటుంది. సుకన్య ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్ లోను చేస్తుంది. త్వరలో రాబోయే భారతీయుడు 2 (bharathiyudu 2) లో కూడా ఆమె ఉందేమో చూడాలి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో ఆమె బతికే ఉంటుంది. మేకర్స్ మాత్రం ఆమె విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు
![]() |
![]() |