![]() |
![]() |

'పుష్ప-2' (Pushpa 2) పాటల జాతర మొదలైంది. ఇప్పటికే 'పుష్ప పుష్ప' అంటూ సాగే మొదటి సాంగ్ విడుదలై.. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో సత్తా చాటుతోంది. ఇక ఇప్పుడు రెండో సాంగ్ (Pushpa 2 Second Single)కి ముహూర్తం ఖరారైంది. ఈసారి పుష్పరాజ్ తో కలిసి శ్రీవల్లి రాబోతుంది.
'పుష్ప-2' రెండో సాంగ్ అనౌన్స్ మెంట్ రేపు(మే 23) ఉదయం 11:07 కి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. " పుష్ప పుష్ప అంటూ పుష్పరాజ్ అలరించాడు. ఇప్పుడు తన సామితో కలిసి శ్రీవల్లి మెస్మరైజ్ చేసే సమయం వచ్చింది." అంటూ మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ మే 30న విడుదల కానుందని సమాచారం.

'పుష్ప-1' విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. 'ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా', 'ఊ అంటావా మావా', 'శ్రీవల్లి', 'సామి సామి', 'దాక్కో దాక్కో'.. ఇలా అన్ని పాటలు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యాయి. అందుకే 'పుష్ప-2' సాంగ్స్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన 'పుష్ప పుష్ప' సాంగ్ ఆకట్టుకుంది. త్వరలో విడుదల కానున్న రెండో సాంగ్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. 'పుష్ప-1'లో పుష్పరాజ్ కోసం శ్రీవల్లి పాడిన 'సామి సామి' పాట పెద్ద హిట్ అయింది. 'పుష్ప-2' సెకండ్ సింగిల్ కూడా ఆ స్థాయిలో ఉంటుందేమో చూడాలి.

అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్ లో సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'పుష్ప-2'లో రష్మిక మందన్న (Rashmika Mandanna), ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం స్వాతంత్ర దినోత్సవం కానుకగా 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |