Home

»

Latest News

ఒకే వేదికపై చిరంజీవి, అల్లు అర్జున్.. ఏం జరగనుంది?

May 16, 2024 6:53PM

తన స్నేహితుడు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ (Allu Arjun) మద్దతు తెలపడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి నుంచి సోషల్ మీడియా.. 'మెగా వర్సెస్ అల్లు' అన్నట్టుగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఒకే వేదికపై చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్ కనిపించనున్నారనే వార్త ఆసక్తికరంగా మారింది.

దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4వ తేదీని 'డైరెక్టర్స్ డే'గా జరుపుకుంటారు. ఈ ఏడాది డైరెక్టర్స్ డే ని భారీగా నిర్వహించాలని దర్శకుల సంఘం భావించగా.. ఎన్నికల కోడ్ కారణంగా మే 4న పర్మిషన్ రాలేదు. ఇప్పుడు ఈ ఈవెంట్ ను మే 19న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో పాటు.. దర్శకులంతా హాజరు కానున్నారు. అయితే ఈ ఈవెంట్ లో చిరంజీవి, అల్లు అర్జున్ హైలైట్ గా నిలిచే అవకాశముంది. 'మెగా వర్సెస్ అల్లు' అంటూ అభిమానుల మధ్య వార్ నడుస్తున్న నేపథ్యంలో.. ఒక వేదికపై చిరంజీవి, బన్నీ కలవనుండటం ఆసక్తి కలిగిస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com