![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తన పుట్టినిల్లు అయిన సినిమా పరిశ్రమ నుంచి రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది. ఇప్పటికే పవన్ కి ఓటేయ్యాలంటు ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో కూడా విడుదల చేసాడు. ఇక సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ అండ్ వైష్ణవ్ తేజ్ లు అయితే ఆల్రెడీ పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ప్రచారం కూడా చేసారు. రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ లు కూడా పవన్ కి ఓటు వేయాలని పిలుపుని ఇచ్చారు. అలాగే నాచురల్ స్టార్ నాని, నిఖిల్ ఇలా మాగ్జిమమ్ అందరు పవన్ కి మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఈ కోవలో ఇద్దరు నటీమణులు చేరారు
రాధికా శరత్ కుమార్.. 80 వ దశకంలో చిరంజీవి తో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఆ ఇద్దరి జంట మంచి హిట్ పెయిర్ కూడా. అప్పటినుంచి ఆమెకి తెలుగు నాట మంచి ఫాలోయింగే ఉంది.కొన్ని సంవత్సరాల నుంచి సీరియల్స్ లో కూడా నటిస్తు అశేష మహిళాదరణని పొందింది. అలాంటి రాధిక పవన్ కళ్యాణ్ గెలుపుని కోరుతుంది. మీ సేవ ప్రజలకు మరింత బలాన్ని సమకూర్చాలి, మీకు శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది. . వాస్తవానికి అలాంటి మాటలు గెలిచిన తర్వాత చెప్తారు. అంటే రాధిక ఉద్యేశంలో పవన్ గెలవబోతున్నాడు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
ఇక ఒకప్పటి ప్రముఖ హీరోయిన్ ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటుతున్న శ్రియా రెడ్డి కూడా పవన్ కి మద్దతు పలికింది. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నది జరగాలి, ఆయనకు విజయం దక్కాలి, అందరు గాజు గ్లాసుకు ఓటు వేయండి అని కోరింది. ప్రస్తుతం ఆమె పవన్ అప్ కమింగ్ మూవీ ఓజి లో ఒక పవర్ ఫుల్ రోల్ లో చేస్తుంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని రోజుల క్రితం ప్రముఖ నటుడు విశాల్ జగన్ కి మద్దతు పలికాడు. మరి ఇప్పుడు శ్రియా రెడ్డి పవన్ కి మద్దతు పలుకుతుంది. శ్రియా రెడ్డి ఎవరో కాదు స్వయానా విశాల్ వదిన. విశాల్ సొంత అన్నయ్య నే పెళ్లి చేసుకుంది
![]() |
![]() |