![]() |
![]() |

అక్కినేని అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న సినిమాల్లో 'మనం' (Manam) ఒకటి. అక్కినేని త్రయం నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య నటించిన ఈ సినిమా 2014 మే 23న విడుదలై ప్రేక్షకులను కట్టిపడేసింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ క్లాసిక్ సినిమా మరోసారి థియేటర్లలో అలరించనుంది.
2024, మే 23తో 'మనం' విడుదలై పదేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక షోలు వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. అక్కినేని త్రయం నటించిన క్లాసిక్ సినిమా కావడం, పైగా ఏఎన్నార్ చివరి సినిమా కావడంతో 'మనం' రీ రిలీజ్ (Manam Re Release) కి మంచి స్పందన లభించే అవకాశముంది. దానికితోడు ఇది ఏఎన్నార్ శతజయంతి సంవత్సరం కావడం విశేషం. 1924, సెప్టెంబర్ 20న ఏఎన్నార్ జన్మించారు.
![]() |
![]() |