![]() |
![]() |

ఎన్నికల హడావుడి కారణంగా ఈ వేసవిలో టాప్ స్టార్ల సినిమాల సందడి లేదు. ఎక్కువగా చిన్న, మీడియం రేంజ్ సినిమాలే విడుదలవుతున్నాయి. ఈవారం నాలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రేపు(మే 3న) 'ఆ ఒక్కటీ అడక్కు', 'ప్రసన్న వదనం', 'శబరి', 'బాక్' సినిమాలు విడుదలవుతున్నాయి.
ఆ ఒక్కటీ అడక్కు (Aa Okkati Adakku):
ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్.. మళ్ళీ తన మార్క్ వినోదాన్ని పంచడానికి 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రంతో వస్తున్నాడు. మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్. ఒకప్పుడు కామెడీ హీరోగా ఎన్నో విజయాలు అందుకున్న నరేష్.. మళ్ళీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.
ప్రసన్న వదనం (Prasanna Vadanam):
విభిన్న సినిమాలతో అలరిస్తూ హీరోగా తనదైన ముద్ర వేస్తున్న సుహాస్.. ఇప్పుడు 'ప్రసన్న వదనం' అనే సినిమాతో రాబోతున్నాడు. ఇందులో ఫేస్ బ్లైండ్ నెస్ తో బాధపడే యువకుడి పాత్రలో సుహాస్ కనిపించనున్నాడు. ఈ థ్రిల్లర్ సినిమాకి అర్జున్ దర్శకుడు.
శబరి (Sabari):
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో అనిల్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'శబరి'. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. మరి ఈ ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ వరలక్ష్మికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
బాక్ (Baak):
సూపర్ హిట్ హారర్ కామెడీ ఫ్రాంచైజ్ 'అరణ్మనై' నుంచి వస్తున్న నాలుగో చిత్రమిది. సుందర్. సి ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన ఈ తమిళ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.
![]() |
![]() |