Home

»

Latest News

'మెర్సీ కిల్లింగ్' చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది : దర్శకుడు వెంకటరమణ

Apr 16, 2024 2:59PM

సాయి సిద్ధార్ద్ మూవీ మేకర్స్ బ్యానర్ పై  తెరకెక్కిన సినిమా 'మెర్సీ కిల్లింగ్'. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య, హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్ద్ హరియల,  మాధవి తాలబత్తుల నిర్మించిన ఈ సినిమాను శ్రీమతి వేదుల బాల కామేశ్వరి సమర్పించారు. సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రఫీ అందించగా ఎం.ఎల్.రాజా సంగీతం సమకూర్చారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మెర్సీ కిల్లింగ్'. స్వేచ్ఛ అనే అనాధ బాలిక తనకు న్యాయం జరగాలంటూ ఈ కథ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 12న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. 

ఎమోషనల్ కథాకథనాలను, సమాజంలో జరిగే కొన్ని సంఘటనలను తీసుకొని చేసిన 'మెర్సీ కిల్లింగ్' సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.  ఫ్యామిలీస్ నుండి మాకు మంచి రెస్పాన్స్ లభిస్తోందని దర్శకులు వెంకటరమణ తెలిపారు.

మా 'మెర్సీ కిల్లింగ్' సినిమా ప్రతి మహిళ చూడాల్సిన సినిమా. ఏప్రిల్ 12న విడుదలైన మా సినిమాకు అన్ని ఏరియాస్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. రిపోర్ట్స్, రివ్యూస్ చూస్తుంటే సంతోషంగా ఉందని చిత్ర సమర్పకురాలు వేదుల బాల కామేశ్వరి తెలిపారు.

రామరాజు, సూర్య, ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా నాయుడు, ఎడిటర్ గా కపిల్ బల్ల వ్యవహరించారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com