![]() |
![]() |

వినూత్నమైన కథలు, వెరైటీ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో సందీప్ కిషన్. ఇటు తెలుగుతో పాటు.. అటు తమిళంలోనూ రాణిస్తున్నాడు. రెండు భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. నటన పరంగా ఇప్పటికే మంచి మార్కులు కొట్టేసిన ఈ హీరోకు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తరవాత అంతటి సక్సెస్ దక్కలేదు. ఇటీవల 'ఊరు పేరు బైరవ'తో అలరించిన సందీప్ కిషన్.. ఇప్పుడు 'ప్రాజెక్ట్-z' అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చేశాడు.
భిన్నమైన కథలని ఎంచుకోవడంలో ఎప్పుడు ముందుంటాడు సందీప్ కిషన్. ప్రముఖ నిర్మాత సి.వి.కుమార్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘మాయవన్’. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. ఈ సినిమాను తెలుగులో 'ప్రాజెక్ట్-z' పేరిట ఏప్రిల్ 8న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సందీప్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. ఇక లావణ్య సైకియాట్రిస్ట్‌గా నటించింది. పోలీస్ ఆఫీసర్ అయిన హీరోకి ఓ మర్డర్ కేసులో లావణ్య సహకరిస్తుంది. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కీలక పాత్ర పోషించారు. అలాగే డేనియల్ బాలాజీ, భగవతి పెరుమాళ్, జయప్రకాష్, మైమ్ గోపి, అక్షర గౌడ ఇతర పాత్రల్లో నటించారు. జిబ్రాన్ సంగీతం అందించారు.
'ప్రాజెక్ట్-z ' సినిమాని థియేటర్లలో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మధ్యకాలంలో మనిషి జీవనశైలి బాగా మారిపోయింది. అందుకే వందేళ్ళు బ్రతకడానికి కూడా కష్టపడుతున్నాడు. అలాంటిది ఓ మనిషి వెయ్యేళ్ళు బ్రతకగలడా? అంటే ఎస్ బ్రతకగలడు అంటూ సీవీ కుమార్ ' ప్రాజెక్ట్-z ' ని తీసుకొచ్చాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా సాగే ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఈ పండక్కి ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల జాబితాలో ' ప్రాజెక్ట్-z ' నిలిచింది. మరి ఈ సినిమాని చూడనివారు థియేటర్లలో చూసేయ్యండి.
![]() |
![]() |