![]() |
![]() |

నాకు నటించడం వచ్చు. మీరేం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా అలా నటించడం ఎంత కష్టమో మీకు తెలుసా? పైగా నా ముఖం కూడా బాగానే ఉంది.. ఇప్పుడు ఇలాంటి మాటలన్నీ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక అంటుంది. ఎప్పుడూ లేనిది రష్మిక ఎందుకు అంత కోపంగా మాట్లాడుతుందో చూద్దాం
యానిమల్ విజయంతో రష్మిక బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని పొందింది.రణబీర్ కి ధీటుగా కూడా నటించిందనే పేరు ని కూడా పొందింది. ఆమె తాజాగా నో ఫిల్టర్ నేహా అనే కార్యక్రమానికి హాజరయ్యింది.ఈ సందర్భంగా యానిమల్ లోని కర్వా చౌత్ సీన్ గురించి డిస్కర్షన్ కి వచ్చింది. ఈ సీన్ లోని రష్మిక నటన బాగోలేదనే విమర్శలు వస్తున్నాయి. ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపైనే రష్మిక మాట్లాడింది.ఆ సీన్ కోసం నేను చాలా కష్టపడ్డాను. తొమ్మిది నిమిషాలపాటు ఉండే ఆ సీన్ లో నటించడానికి నేను పడిన కష్టం ఎవరకి తెలుస్తుంది. కేవలం 10 సెకన్లు బాగోనందుకు నా నటనని విమర్శిస్తున్నారు.

ఏ విధంగా నటించాలో నాకు బాగా తెలుసు. అయినా నా నటనకి రావాల్సిన వాళ్ళ దగ్గరనుంచి ప్రశంసలు దక్కాయి పైగా అందరకి నా నటన నచ్చాలని లేదుగా అని కూడా చెప్పింది. ప్రస్తుతం ఈ మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి.రష్మిక ఇటీవలే తన పుట్టిన రోజుని కూడా జరుపుకుంది. పుష్ప 2 , ది గర్ల్ ఫ్రెండ్, ఛవా సినిమాలు చేస్తుంది.
![]() |
![]() |