![]() |
![]() |

కన్నడ హీరో డార్లింగ్ కృష్ణ దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తూ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'లవ్ మాక్‌టైల్ 2' నుంచి 'నీదేలే నీదేలే జన్మ' సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. 'నీదేలే నీదేలే జన్మ' అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా సురేంద్రనాథ్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, చార్లీ లవ్ మాక్‌టైల్ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అదేవిధంగా డార్లింగ్ కృష్ణ నిర్మాతగా, దర్శకుడుగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన లవ్ మాక్‌టైల్, లవ్ మాక్‌టైల్ 2 కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు లవ్ మాక్‌టైల్ 2 సినిమాని తెలుగులో కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ పతాకం పై ఎం వి ఆర్ కృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎం.వి.ఆర్ కృష్ణ గారు మాట్లాడుతూ.. "కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాని వేసవి సెలవుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. డార్లింగ్ కృష్ణ కన్నడలో బ్లాక్ బస్టర్ హీరోగా మంచి సినిమాల్లో నటించాడు. అతను దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కి సంబంధించిన రెండవ పాటను నేడు విడుదల చేసాం. గతంలో విడుదల చేసిన మొదటి పాటకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, రిలీజ్ డేట్ ప్రమోషన్ యాక్టివిటీస్ తో గ్రాండ్ గా మీ ముందుకు వస్తాం. మంచి సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. ఈ సినిమా కూడా అలాగే కంటెంట్ ఉన్న ఒక మంచి సినిమా. ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అన్నారు.
ఈ సినిమాలో మిలనా నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. నకుల్ అభయాన్కర్ సంగీతం అందించిన 'లవ్ మాక్‌టైల్ 2' చిత్రానికి శ్రీ క్రేజీ మైండ్స్ సినిమాటోగ్రాఫర్ గా, ఎడిటర్ గా వ్యవహరించారు.
![]() |
![]() |