![]() |
![]() |

రవితేజ భద్ర, పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్, బాలకృష్ణ మహారథి లతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యిన నటి మీరా జాస్మిన్(Meera jasmine) అంతెందుకు విశాల్ హీరోగా 2005 లో వచ్చిన పందెం కోడి లో అద్భుతంగా నటించి సౌత్ సినీ పరిశ్రమని ఒక ఊపు ఊపింది.ఆమె కోసమే రిపీటెడ్ గా పందెం కోడి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతటి క్రేజ్ సంపాదించిన మీరా ఇంట్లో తాజాగా ఒక విషాదం చోటు చేసుకుంది.
మీరా జాస్మిన్ స్వస్థలం కేరళలోని తిరువల్ల. ఆమె అక్కడే పుట్టి పెరిగారు.పూర్తి పేరు జాస్మిన్ మేరీ జోసెఫ్. ఆమె తండ్రి పేరు జోసెఫ్ ఫిలిప్. ఆయన కన్నుమూశారు. వయసు మీద పడటంతో చనిపోయారని తెలుస్తుంది. ఆయన వయసు ప్రస్తుతం ఎనభై మూడు సంవత్సరాలు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అస్వస్ధత కి గురవ్వడంతో ఎర్నాకుళంలోని ఒక హాస్పిటల్ లో జాయిన్ చేసారు. ట్రీట్మెంట్ పొందుతూ చనిపోవడం జరిగింది. దీంతో పలువురు ప్రముఖులు మీరా జాస్మిన్ కి తమ సానుభూతిని తెలియచేస్తున్నారు
2001 లో వచ్చిన సూత్రధారణ్ అనే మలయాళ మూవీతో మీరా జాస్మిన్ సినీ రంగ ప్రవేశం జరిగింది.తెలుగు తమిళ మలయాళ ,కన్నడ భాషల్లో కలిపి మొత్తం 60 చిత్రాలకి పైగా నటించింది. తన సినీ జీవితంలో ఏనాడు కూడా కుటుంబ విషయాలని పంచుకోలేదు. 2014 నుంచి 2018 వరకు ఆమె సినీ కెరీర్ బాగానే సాగింది. ఆ తర్వాత నాలుగు సంవత్సరాల పాటు సినిమాలేమి చెయ్యలేదు. రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చింది. పలు భాషల్లో సినిమాలకి కమిట్ అయ్యింది.
![]() |
![]() |