![]() |
![]() |

'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)కు ఆ స్థాయి విజయం దక్కలేదు. మధ్యలో 'టాక్సీవాలా' మాత్రమే హిట్ అనిపించుకోగా.. 'నోటా', 'డియర్ కామ్రేడ్', 'వరల్డ్ ఫేమస్ లవర్' వంటి సినిమాలు నిరాశపరిచాయి. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న పాన్ ఇండియా మూవీ 'లైగర్' ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అలాగే విజయ్ నటించిన గత చిత్రం 'ఖుషి' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. లవ్ స్టోరీ కావడం, అధిక బిజినెస్ చేయడంతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా మిగిలింది. ఈ క్రమంలో విజయ్.. తనకు 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ తో కలిసి చేసిన 'ఫ్యామిలీ స్టార్'(Family Star) పైనే ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ యూఎస్ ప్రీమియర్లకు పరవాలేదు అనే టాక్ వస్తోంది.
'ఫ్యామిలీ స్టార్' మూవీ ఫస్టాప్.. విజయ్-మృణాల్ మధ్య ప్రేమ సన్నివేశాలు, మధ్య తరగతి కుటుంబ అనుబంధాల నేపథ్యంలో నడుస్తుందట. సీన్స్ రెగ్యులర్ గా అనిపించినప్పటికీ.. విజయ్- మృణాల్ పెయిర్ ఫ్రెష్ గా ఉందని, డైలాగ్స్ కూడా బాగున్నాయని అంటున్నారు. ఇక సెకండాఫ్ లో ఎమోషనల్ టచ్ ఉంటుందట. మూవీలో అక్కడక్కడా కామెడీ కూడా వర్కౌట్ అయిందట. మొత్తానికి సినిమా కొంచెం లవ్, కొంచెం ఫన్, కొంచెం ఎమోషన్ తో సాగుతుందట. 'గీత గోవిందం' మ్యాజిక్ అయితే రిపీట్ కాలేదు కానీ.. ఓవరాల్ గా మాత్రం సినిమా పరవాలేదు అనే టాక్ వస్తోంది. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
![]() |
![]() |