![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ప్రముఖ నిర్మాత సంస్థ గీతా ఆర్ట్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఆ గిఫ్ట్ కి ఫిదా అయిన ఫ్యాన్స్.. గీతా ఆర్ట్స్ కి థాంక్స్ చెబుతున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ 'మగధీర'. ఈ సినిమానే రామ్ చరణ్ ని స్టార్ గా నిలబెట్టిందని చెప్పవచ్చు. 'చిరుత'(2007)తో తెలుగుతెరకు పరిచయమైన చరణ్.. తన రెండో సినిమా 'మగధీర'(2009)ను రాజమౌళి దర్శకత్వంలో చేశాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించారు. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కథాకథనాలు, యుద్ధ సన్నివేశాలు, పాటలు, సంభాషణలు ఇలా అన్నీ ప్రేక్షకులను కట్టి పడేశాయి. అందుకే ఈ చిత్రం అప్పటిదాకా తెలుగు సినీ చరిత్రలో ఉన్న రికార్డులను తిరగరాసి.. అత్యధిక వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

రామ్ చరణ్ పుట్టినరోజు(మార్చి 27) కానుకగా 'మగధీర'ను ఇటీవల రీరిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ కి గీతా ఆర్ట్స్ అంతకుమించిన గిఫ్ట్ ఇచ్చింది. తాజాగా 4K లో 'మగధీర'ను యూట్యూబ్ లో విడుదల చేసింది. క్వాలిటీ అదిరిపోవడంతో పాటు, ఉచితంగా చూసే అవకాశం కల్పించడంతో.. రామ్ చరణ్ ఫ్యాన్స్ గీతా ఆర్ట్స్ కి థాంక్యూల మీద థాంక్యూలు చెబుతున్నారు. అంతేకాదు యూట్యూబ్ లో విడుదలైన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ లో దూసుకుపోతోంది మగధీర.
![]() |
![]() |