![]() |
![]() |

ఆయన మూడు వందల యాభై సినిమాలకి పైనే రచయితగా పని చేసిన రచనా ధీరుడు. తన కథ, కథనంతో, మాటలతో సినిమాలో వేగాన్ని కూడా పెంచాడు. సాదారణ హీరోలని సైతం అగ్ర హీరోలుగా మార్చాడు.స్క్రీన్ ప్లే కి మాస్టర్ కూడాను. అలాగే ఆయన రాసిన డైలాగ్ లు నేటికీ ప్రజల నోళ్ళల్లో ఊతపదాలు గా నానుతూనే ఉన్నాయి. ఆయన ఎవరో కాదు పరుచూరి బ్రదర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ. తాజాగా ఆయన హనుమాన్ మూవీ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి
గోపాలకృష్ణ గారు పరుచూరి పలుకులు అనే కార్యక్రమాన్ని ఎప్పటినుంచో నిర్వహిస్తున్నారు. ఇందులో సినిమాల గురించి చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తు ఉంటారు. అంటే ఒక సినిమా ఎందుకు హిట్ అయ్యింది ఎందుకు ప్లాప్ అయ్యిందో చెప్తారు. ఈ క్రమంలో ఆయన తాజాగా హనుమన్ మూవీ గురించి మాట్లాడారు. ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి స్ఫూర్తి హనుమాన్ మూవీలోని కొన్ని పాత్రల్లో కనిపించిందని చెప్పాడు. చిన్న పిల్లాడు పెద్ద విలన్ ని పడగొట్టాడు అంటే అంతగా బాగుండదు కాబట్టి హీరో తేజ కి దైవ శక్తులు ఉన్నట్టు చూపించారని చెప్పాడు. అలాగే దర్శకుడు ప్రశాంత్ వర్మ ని కూడా గోపాలకృష్ణ గారు పొగిడాడు. ప్రశాంత్ వర్మ చాలా తెలివిగా సినిమాని తెరకెక్కించాడని ఎవరు ఊహించని విధంగా ఓపెనింగ్ సన్నివేశంలోని ట్విస్ట్ ని చివరలో చూపించాడని చెప్పుకొచ్చాడు.ఇంకా హనుమాన్ కి సంబంధించిన చాలా విషయాలని ప్రేక్షకులతో పంచుకున్నాడు.సోషల్ మీడియా ద్వారా వాటిని చాలా మంది చూస్తున్నారు.
ఇక పరుచూరి సినీ కెరీర్ లో విజయాల గురించి చెప్పుకోవాలంటే ఒక్క రోజు సరిపోదు. అయన కెరీర్లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి.ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు.కొన్ని సినిమాలకి దర్శకుడు గా కూడా పని చేసారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ ,శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ ,నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్స్ తో పని చేసారు.
![]() |
![]() |