Home

»

Latest News

అమ్మ ప్రేమ ఎన్టీఆర్ స్నేహం ఒకటే.. బర్త్ డే బాయ్ చరణ్ కి అదిరిపోయే ట్వీట్ 

Mar 27, 2024 4:03PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (ntr)  మొదటి నుంచి కూడా స్నేహానికి ఎంతో విలువని ఇస్తాడు. ఈ విషయం చాలా సార్లు రుజవయ్యింది.  ఆయన పంచే స్నేహంలో  పేద, ధనిక,అనే బేధం ఉండదు. చిన్న నాటి స్నేహితులని కూడా మర్చిపోకుండా కలుస్తుంటాడు.ఎవరైనా  ఒక్కసారి  తనకు నచ్చారంటే ఇంక స్నేహాన్ని చివరి శ్వాస వరకు వదిలి పెట్టకపోవడం ఎన్టీఆర్ నైజం. అమ్మ ప్రేమ ఎన్టీఆర్ స్నేహం రెండు ఒకటే అని కూడా అంటారు. తాజాగా తన ఫ్రెండ్  బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్  చేసిన ట్వీట్ పలువురిని ఆకర్షిస్తుంది.
 
ఈ రోజు ప్రముఖ హీరో రామ్ చరణ్ (ram charan) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ట్విటర్ వేదికగా చరణ్ కి శుభాకాంక్షలు తెలిపాడు. హ్యాపీ బర్త్ డే మై బ్రదర్ విషింగ్ ఆ ఇయర్ ఏ హెడ్ ఫిల్డ్ విత్ జాయ్ అండ్ సక్సెస్ అని పోస్ట్ చేసాడు. అంటే సంతోషం మరియు విజయంతో చరణ్  ముందుకు సాగాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఇప్పుడు ఈ పోస్ట్  వైరల్ గా మారింది. ఇరువురి ఫ్యాన్స్ కూడా వాళ్ళ స్నేహానికి  మురిసిపోతున్నారు. అలాగే చరణ్ కి బర్త్ డే విషెస్ కూడా  చెప్తున్నారు.

 


.

ఇక చరణ్, ఎన్టీఆర్  కలిసి ఆర్ఆర్ఆర్ (rrr)  లో నటించారు. 2022 లో వరల్డ్ వైడ్ గా ఆ మూవీ విడుదల అయ్యింది. ఆ ఇద్దరి నట విన్యాసానికి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద కలెక్షన్ల వర్షం కురిసింది. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన  టాప్ 3  చిత్రంగా కూడా  నిలిచింది. ఆ సినిమా విడుదల సమయంలో జరిగిన ప్రమోషన్స్ లో ఎన్టీఆర్, చరణ్ ల మద్య ఉన్న కొన్ని సీక్రెట్స్ బయటపడ్డాయి.వాటిని ఎన్టీఆర్ నే బయటపెట్టాడు. చరణ్ ప్రతి పుట్టిన రోజుకి  అర్ధరాత్రి 12 దాటడం ఆలస్యం ఇద్దరు ఒకే కారులో వెళ్లి పార్టీ చేసుకుంటారు. దాంతో ఈ సంవత్సరం ఎక్కడ పార్టీ చేసుకున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అలాగే మళ్ళీ ఆ ఇద్దరి కాంబోలో సినిమా రావాలని కూడా కోరుకుంటున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com