![]() |
![]() |

ఎట్టకేలకు గేమ్ చేంజర్(game changer) నుంచి సాంగ్ రిలీజ్ అయ్యింది. కొద్దీ సేపటి క్రితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (ram charan)బర్త్ డే సందర్భంగా జరగండి అనే సాంగ్ రిలీజ్ అయ్యింది.దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మరి అది ఎలా ఉందో చూద్దాం.
జరగండి (jaragandi) జరగండి అనే పల్లవి తో పాట ప్రారంభం అయ్యింది. మొత్తం 4 నిమిషాల 20 సెకన్ల నిడివి ఉన్న లిరికల్ వీడియో. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపించింది.ప్రముఖ సింగర్స్ దలర్ మెహిందీ ((Daler Mehndi) సునిధి చౌహన్(Sunidhi Chauhan) లు ఆలపించగా అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. ఎస్ ఎస్ థమన్ (Thaman S) సంగీతాన్ని అందించాడు. రకరకాల రంగులతో ఉన్న పెద్ద పెద్ద భవంతులు ఒక దాని మీద ఒకటి పడిపోయినట్టుగా వేసిన సెట్టింగ్ సూపర్ గా ఉంది. కాస్ట్యూమ్స్ కూడా కొత్తగా ఉన్నాయి.

ఇక సాంగ్ యూ ట్యూబ్ లో అలా రిలీజ్ అయ్యిందో లేదో రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అలాగే సాంగ్ చూస్తున్నంతసేపు కూడా చరణ్ ని గ్లోబర్ స్టార్ అని ఎందుకు అంటారనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. చరణ్, కియారా అద్వానీ( Kiara Advani) లు రకరకాల గెటప్ ల్లో ఎంతో ఎనర్జీ గా డాన్స్ చేసారు.దీంతో థియేటర్ లో ఎప్పుడెప్పు చూస్తామా అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. స్టార్ కొరియో గ్రాఫర్ అండ్ స్టార్ డైరెక్టర్ అయిన ప్రభుదేవా (Prabhu Deva) ఆ పాటకి నృత్య దర్శకత్వాన్ని వహించాడు. భారతీయ అగ్ర దర్శకుడు శంకర్ (S. Shankar) దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు( dil raju) నిర్మిస్తున్నాడు
![]() |
![]() |