![]() |
![]() |
‘జయం’, ‘దిల్’ వంటి సూపర్‌హిట్ సినిమాలతో హీరో నితిన్(Nithiin) కెరీర్ ఎంతో బ్రైట్‌గా ఉంటుందని అందరూ భావించారు. ఆ సినిమాల తర్వాత చేసిన ‘సంబరం’, ‘శ్రీఆంజనేయం’ చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో నితిన్ కెరీర్‌లో చిన్న జర్క్ వచ్చింది. అయితే ఆ వెంటనే రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో చేసిన ‘సై’తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక తన కెరీర్‌కి తిరుగులేదనుకున్నాడు. కానీ, ఎక్కినంత సేపు పట్టలేదు దిగడానికి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ చేసిన ‘అల్లరి బుల్లోడు’ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అతని ఫ్లాపుల పరంపర మొదలైంది. వరసగా 12 ఫ్లాప్ సినిమాలు అతని ఖాతాలో వచ్చి చేరాయి. చివరికి నితిన్‌ని హీరోగా పరిచయం చేసిన తేజ కూడా అతనికి హిట్ ఇవ్వలేకపోయాడు. సాధారణంగా రెండు, మూడు ఫ్లాపులు వరసగా వచ్చాయంటే అతన్ని ఇంటికి పంపించేస్తారు. కానీ, నితిన్‌కి ఉన్న బ్యాక్‌గ్రౌండ్ కారణంగా అన్ని ఫ్లాపుల తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగాడు. వరసగా 12 ఫ్లాపులు ఇచ్చి రికార్డు సృష్టించిన నితిన్‌కి ‘ఇష్క్’ చిత్రంతో ఒక మెమరబుల్ హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె.కుమార్. ఈ సినిమా తర్వాత కూడా కొన్ని ఫ్లాపులు ఇచ్చినా నితిన్ కెరీర్‌లో ‘అఆ’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘భీష్మ’ వంటి సూపర్‌హిట్ సినిమాలు కూడా ఉన్నాయి.
ఈమధ్య వరసగా 5 ఫ్లాప్ సినిమాల్లో నటించిన నితిన్‌కి మరో సూపర్‌హిట్ అత్యవసరం అయింది. ఒక మంచి హిట్ సినిమా ద్వారా తన కెరీర్‌కి ఊపిరి పోసిన విక్రమ్ కె.కుమార్ మళ్ళీ నితిన్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. అయితే వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ‘రాబిన్‌హుడ్’, వేణుశ్రీరామ్ కాంబినేషన్‌లో ‘తమ్ముడు’ సినిమాలు నితిన్ చేతిలో ఉన్నాయి. అరడజను ఫ్లాపుల తర్వాత హిట్ వస్తుందన్న నమ్మకం నితిన్‌కి ఉందో లేదో.. అందుకే తనకి మంచి హిట్ ఇచ్చిన విక్రమ్‌ని కూడా లైన్‌లో పెట్టాడు. నితిన్, విక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ఓకే అయిందని తెలుస్తోంది. ‘హనుమాన్’(Hanuman) చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నిర్మాత నిరంజన్‌రెడ్డి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. ఈ మూడు సినిమాలతో నితిన్ మళ్ళీ హిట్ ట్రాక్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
![]() |
![]() |