Home

»

Latest News

ఎన్నిసార్లని కాదు..బుల్లెట్ దిగిందా లేదా

Mar 22, 2024 5:01PM

ఎన్ని సినిమాలు చేశామన్నది  ముఖ్యం కాదు. ఎంతమంది అభిమానులని సంపాదించామన్నది ముఖ్యం. ఈ  కొటేషన్   హీరోలకే కాదు హీరోయిన్ లకి కూడా వర్తిస్తుంది. అలా వర్తించే  హీరోయిన్ లలో ఒకరు పాయల్ రాజ్ పుత్.  ఆర్ఎక్స్ 100 తో ఎంతో మంది అభిమానులని సంపాదించింది. ఇంకా చెప్పాలంటే  ఆ మూవీతో  10 సినిమాల ఇమేజ్ ని కూడా  సంపాదించింది.ఇప్పుడు  లేటెస్ట్ గా వచ్చిన  న్యూస్ ఒకటి ఆమె కెపాసిటీ ని తెలియజేస్తుంది.  

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో లాస్ట్ ఇయర్ నవంబర్ లో వచ్చిన మూవీ మంగళవారం. ఒక డిఫెరెంట్ క్యారక్టర్ లో పాయల్ తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని  కూడా రాబట్టింది. ఇక అసలు విషయానికి వస్తే మంగళవారం మూవీ రీసెంట్ గా స్టార్ మాలో ప్రత్యక్ష మయ్యింది. 4.05 టీఆర్పీ రేటింగ్ ను రాబట్టి సంచలనం సృష్టించింది.ఇది ఒక రకంగా రికార్డు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి కూడా స్టార్ మా లో ప్రసారమయ్యింది. అప్పుడు కూడా రికార్డు వ్యూయర్స్ ని సృష్టించింది.

 ఓటిటి లో ప్రసారం అయినప్పుడు  కూడా మంచి విజయాన్ని అందుకుంది. పాయల్ తో పాటు ప్రియదర్శి, నందిత శ్వేత, అజయ్ ఘోష్  కీలక పాత్రల్లో నటించారు. అజయ్ భూపతి దర్శకత్వాన్ని వహించాడు.ముద్ర మీడియా వర్క్స్ పై  స్వాతి గునుపాటి,సురేష్ వర్మ లు నిర్మించారు. అజయ్ భూపతి కూడా మరో నిర్మాతగా వ్యవహరించాడు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com