![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఆయన కొత్త చిత్రం సినీ ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.
తన 15వ సినిమా 'గేమ్ ఛేంజర్'ను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న రామ్ చరణ్.. 16వ సినిమాని 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈరోజు(మార్చి 20) ఉదయం ఈ మూవీ లాంచ్ అయింది.

'RC 16' పూజా కార్యక్రమానికి హీరో హీరోయిన్లు రామ్ చరణ్, జాన్వీ కపూర్ తో పాటు చిత్ర బృందమంతా హాజరైంది. మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దర్శకులు శంకర్, సుకుమార్, మైత్రి నిర్మాతలతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ లాంచ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిలో చరణ్, జాన్వీ జోడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే క్లీన్ షేవ్ తో చరణ్ లుక్ బాగుంది. ఇక చరణ్, సుకుమార్ పక్కపక్కన కూర్చొని మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో వారి కలయికలో 'రంగస్థలం' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వచ్చింది. 'RC 16' తర్వాత వీరి కాంబోలో మరో సినిమా వచ్చే అవకాశముంది.
![]() |
![]() |