![]() |
![]() |

నిన్న తెలుగు నాట విడుదలైన మూవీ ప్రేమలు. ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో గత నెలలో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది.అలాగే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబడుతు ముందుకు దూసుకెళ్తుంది. మరీ తెలుగు వెర్షన్ కి వచ్చిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
మొదటి రోజు తెలుగు రాష్టాల్లో 1.5 కోట్ల రూపాయల గ్రాస్ ని సాధించింది. నైజాంలో 80 లక్షలు, ఆంధ్రాలో 70 లక్షల రూపాయలు గ్రాస్ ని రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.ఇవి ఆషా మాషి కలెక్షన్స్ కాదు. నెంబర్ వన్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రేమలు లో నటించిన ఏ ఒక్క ఆర్టిస్ట్ కూడా తెలుగు ప్రేక్షకులకి తెలియదు. అలాగే దర్శకుడు గాని నిర్మాత గాని కూడా తెలియదు. కేవలం కంటెంట్ మీద నమ్మకంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక విడుదలైన అన్ని చోట్ల కూడా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తుంది. కేవలం యూత్ అనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మూవీని ఆదరిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగులో విడుదల చేసాడు. ఒరిజినల్ వెర్షన్ కి ఫాహద్ ఫాజిల్ నిర్మాత. నస్లీన్ , మమిత బైజు హీరో హీరోయిన్లుగా చేసారు. ఆదిత్య హాసన్ డైలాగ్స్ ని అందించాడు. ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది.
![]() |
![]() |