![]() |
![]() |

వన్ మ్యాన్ షో తో సినిమాని హిట్ చేయగలిగే సత్తా ఉన్న హీరోల్లో మహేష్ బాబు కూడా ఒకడు. కొన్ని లక్షల మంది అభిమాన గణం ఆయన సొంతం.సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిత్వంలోను మహేష్ ని అభిమానించే వాళ్ళు కోకొల్లలు. తాజాగా మహేష్ వ్యక్తిత్వానికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది.
సోషల్ మీడియాలో మహేష్ ఎంతో యాక్టీవ్ గా ఉంటాడనే విషయం అందరికి తెలిసిందే. తను చేసే పోస్టులకి గాని, ఇనిస్టా స్టోరీస్ కి గాని చాలా మందిని ఆకట్టుకుంటాయి. నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా తన ఇనిస్టా స్టోరీ లో తన తల్లి ఇందిరా దేవి,భార్య నమ్రత, కూతురు సితార ల పిక్స్ ని ఉంచాడు. వాటికి నా జీవితంలోకి ప్రేమ, దైర్యం, ఆనందాన్ని తీసుకొచ్చేది మీరే అనే కొటేషన్ ని ఉంచాడు. ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉంది. 13 .4 మిలియన్ ఫాలోవర్స్ మహేష్ కి ఉన్నారు.

మహేష్ ప్రస్తుతం రాజమౌళి కి సంబంధించిన కొత్త మూవీకి కమిట్ అయ్యాడు. త్వరలోనే షూటింగ్ కి వెళ్ళబోతున్న ఆ మూవీ మీద అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. ఆ మూవీ కథ పలానా అంటూ రోజుకొక వార్త సోషల్ మీడియా లో దర్శనం ఇస్తుంది.ఈ మూవీ కోసం మహేష్ సరికొత్తగా రెడీ అవ్వబోతున్నాడు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప సినిమాగా అది నిలబడబోతుందనే వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం మహేష్ యాడ్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు.
![]() |
![]() |