![]() |
![]() |
విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో విద్యాధర్ దర్శకత్వంలో రూపొంది డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘గామి’. మార్చి 8న విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభించినప్పటికీ వరల్డ్‌వైడ్‌గా రూ.9.7 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. కొత్త తరహా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ కలెక్షన్స్‌తో మరోసారి ప్రూవ్ అయింది. ఇండియాలోనే కాదు, యు.ఎస్.లో కూడా మంచి ఓపెనింగ్స్ రాట్టుకుందీ సినిమా.
టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందిన ఈ సినిమా విజువల్‌గా ఎంతో గ్రాండియర్‌ని సొంతం చేసుకుంది. హిమాలయాల్లోని రేర్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌గా అనిపిస్తాయి. ఇప్పటి వరకు విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమాల్లోకెల్లా ‘గామి’ డెఫినెట్‌గా కొత్త తరహా సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాకి విద్యాధర్ టేకింగ్, నరేష్ కుమారన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విశ్వనాథరెడ్డి సినిమాటోగ్రఫీ ప్రాణం పోసాయని చెప్పొచ్చు. రిలీజ్‌కి ముందే సినిమాకి బాగా హైప్ క్రియేట్ చేశారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి సైతం సినిమా యూనిట్‌ని అభినందించడంతో భారీ ఓపెనింగ్స్ సాధించింది ‘గామి’
![]() |
![]() |