![]() |
![]() |

వర్సటైల్ యాక్టర్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన మూవీ భ్రమయుగం. మలయాళం లో ఫిబ్రవరి 15 , తెలుగులో 23 న రిలీజ్ అయ్యింది. రెండు చోట్ల కూడా మంచి విజయాన్నే దక్కించుకుంది. అంతే కాకుండా చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని, ఒక కొత్త ప్రపంచాన్ని చూసినట్టుగా ఉందని చెప్పారు.ఈ నేపథ్యంలో లేటెస్ట్ న్యూస్ ఒకటి సినీ ప్రేమికుల్లో హుషారు ని తీసుకొచ్చింది.
భ్రమయుగం ఓటిటి లో ప్రత్యక్ష మవ్వనుంది. ఈ నెల 15 నుంచి ప్రముఖ ఛానల్ సోనీ లైవ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్నీ సోనీ లైవ్ అధికారకంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. పైగా ఇంకో ఆనందకరమైన విషయం ఏంటంటే ఒరిజినల్ వెర్షన్ మళయాళంతో పాటు తెలుగు, తమిళ,కన్నడ, హిందీ భాషల్లో భ్రమ యుగం ప్రసారం కానుంది. దీంతో మమ్ముట్టి అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు సంతోషంగా ఉన్నారు.
అనుక్షణం సస్పెన్స్ ని, థ్రిల్లర్ ని కలుగచేసే ఈ మూవీలో మమ్ముట్టి చాలా ఎక్స్‌ట్రా ఆర్డినరీ గా చేసాడు. ఎవరు ఊహించని విధంగా కథ సాగుతుంది.అలాగే మూవీలో తక్కువ మంది క్యారక్టర్ లే ఉన్నా కూడా ఆ ఫీలింగ్ ప్రేక్షకుడికి అనిపించదు. రెగ్యులర్ సినిమా ఫార్మేట్ కి విరుద్ధంగా తెరకెక్కి భిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అమల్దా లిజ్, అర్జున్ అశోకన్, సిద్దార్ధ్ తదితరులు మమ్ముట్టి కి పోటా పోటీగా నటించారు. సుమారు 27 కోట్ల బడ్జట్ తో భ్రమ యుగం తెరకెక్కింది.
![]() |
![]() |