![]() |
![]() |

ప్రముఖ నటి అంజలి టైటిల్ రోల్ పోషించిన హారర్ కామెడీ చిత్రం 'గీతాంజలి', 2014 ఆగస్టులో విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' రాబోతుంది. మార్చి 22న ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇటీవల విడుదలైన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
'గీతాంజలి' చిత్రంలో కూడా దిల్ రాజు ఒక సన్నివేశంలో మెరిశారు. ఈ సినిమాలో దర్శకుడు కావాలని కలలు కనే శ్రీనివాస్ రెడ్డి.. నిర్మాత దిల్ రాజుకి కథ చెప్పాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో చాలా సన్నివేశాల్లో దిల్ రాజు పేరు వినిపిస్తుంది. అలాగే ఒక సన్నివేశంలో ఆయన కనిపిస్తారు కూడా. దానిని సెంటిమెంట్ గా భావించిన మేకర్స్.. సీక్వెల్ లో కూడా నటించమని దిల్ రాజుని కోరడంతో.. ఆయన కాదనలేకపోయారట. అంతేకాదు షూటింగ్ లొకేషన్ లో కమెడియన్ సత్యతో కలిసి దిల్ రాజు నటించిన సీన్ కి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

'గీతాంజలి మళ్ళీ వచ్చింది' అంజలి నటిస్తున్న 50వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకుడు. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో అంజలితో పాటు శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్, రాహుల్ మాధవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కోన వెంకట్ కథ అందిసున్న ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ప్రవీణ్ లక్కరాజు, సినిమాటోగ్రాఫర్ గా సుజాత సిద్ధార్థ్, ఎడిటర్ గా చోటా కె ప్రసాద్ వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |