![]() |
![]() |

సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కి మాత్రమే కాదు వాళ్ల పిల్లలకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ - రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ అంటే చాలు ఫాన్స్ పడి చస్తారు. అకీరా నందన్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాడు. రేణు దేశాయ్ కూడా వాళ్ళ ఫొటోస్ ని, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పిక్ ని రేణు పోస్ట్ చేసింది. అలాగే తన కుమారుడు అకీరానందన్ కి, కుమార్తె ఆద్యకు ఒక మంచి టిప్ కూడా ఇచ్చారట..ఇంతకు ఎం చెప్పారు అనుకుంటున్నారా?..
ఈ రోజుల్లో పిల్లలు టెక్నాలజీకి ఎంతగా అలవాటు పడిపోయారో అందరికీ తెలిసిన విషయమే.. వాటి వల్ల సమస్యలు వస్తాయి అని చెప్పినా వినే పరిస్థితుల్లో ఉండడం లేదు. రేణుదేశాయ్ కూడా తన పిల్లల విషయంలో ఇలాగే బాధపడుతున్నారట. ఈరోజున ప్రతీ ఒక్కరూ బ్లూ టూత్ ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు. అందులోనూ వైర్ లెస్ బ్లూ టూత్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. తన పిల్లలు వాటిని వాడకుండా ఉండేలా ఒక సలహా ఇచ్చారు రేణు దేశాయ్. "బ్లూటూత్ టెక్నాలజీ చెవులకు, మెదడుకు హాని కలిగిస్తుంది అని నేను భావిస్తున్నాను కాబట్టి పాత కాలంలో వాడే వైర్డ్ ఇయర్‌ఫోన్‌లను యూజ్ చేయమంటూ అకిరాకు, ఆద్యకు చెబుతున్నాను...ఇక అకిరా ఇప్పుడిప్పుడే చెప్పేది వింటున్నాడు. ఫ్యాన్సీ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ లను వాడడం తగ్గించాడు. నెమ్మదిగా వైర్డ్ ఇయర్‌ఫోన్ లను వాడుతున్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను." అంటూ తన మనసులోని మాటను రాసుకొచ్చింది. అమ్మ మాటకు అకీరా ఎంత విలువ ఇస్తున్నాడో దీన్ని బట్టి అర్ధమవుతోంది.

అకీరా నందన్ సంక్రాంతి సంబరాల్లో మెగా ఫ్యామిలీతో కలిసి సందడి చేసాడు. మెగా వారసుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక వరుణ్ తేజ్ కి అకీరా అంటే ఎంతిష్టమో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |