![]() |
![]() |
సమంత.. టాలీవుడ్ హీరోయిన్లలో ఒక ప్రత్యేకత ఉన్న హీరోయిన్. వాస్తవానికి సమంత తమిళనాడు నుంచి వచ్చినప్పటికీ తెలుగు హీరోయిన్‌గా సెటిల్ అయిపోయి ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. సినిమాల్లో నటించడంతోపాటు కొన్ని సోషల్ యాక్టివిటీస్, కొన్ని డిసీజ్‌లకు సంబంధించిన కాంపైయిన్లలో కూడా పాల్గొని ప్రజల్లో వాటి పట్ల అవగాహన పెంచేందుకు ప్రయత్నించింది. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. అలాంటి సమంత.. అనారోగ్యానికి గురి కావడం అందర్నీ బాధించింది. మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన సమంత త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా అందరూ కోరుకున్నారు.
ఆ వ్యాధి కారణంగా ఏర్పడే సైడ్ ఎఫెక్ట్‌ల నుంచి తనను తాను కాపాడుకునేందుకు కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. విదేశాల్లోనే ఎక్కువగా ఉంటూ చికిత్స తీసుకుంటోంది. అంతేకాకుండా తన మనసుని ఉల్లాసపరిచే ప్రదేశాల్లో విహరిస్తూ శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులకు టచ్‌లోనే ఉంటోంది. చాలా కాలంగా చికిత్స తీసుకుంటున్న సమంత ఇప్పుడు చాలా వరకు రికవరీ అయినట్టుగా కనిపిస్తోంది. తన ఫిట్‌నెస్ గురించి తెలిపేందుకు వరసగా ఫోటో షూట్స్ చేస్తోంది. అంతేకాదు, ఆటవిడుపుగా ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని ఈవెంట్స్‌కి కూడా అటెండ్ అవుతోంది. ఇటీవల మలేషియాలోని ఓ జ్యూయలరీ షాప్ ప్రారంభోత్సవానికి హాజరైంది. ఆ తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉండి రెస్ట్ తీసుకుంది. ఆ టైమ్‌లోనే ఓ ఖరీదైన రిసార్ట్‌లో తను దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆ రిసార్ట్‌కి దగ్గరలో ఉన్న ఓ అందమైన జలపాతంలో సేద తీరుతూ తీసుకున్న కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. బికినీలో ఉన్న ఆ ఫోటోలను చూస్తే సమంత పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని అర్థమవుతోంది. ఆమెలోని అందం, ఆకర్షణ రెట్టింపు అయ్యాయన్న ఫీలింగ్ కలుగుతోంది.
సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన ఈ ఫోటోలను చూసి నెటిజన్లు, అభిమానులు చాలా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు. సమంత ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడినట్టు కనిపిస్తోందని చాలామంది కామెంట్ చేయగా.. ఆమె చిరునవ్వు చూస్తే ఆ విషయం ఇట్టే తెలిసిపోతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే.. తను నటించిన ఓ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా ఇటీవలే పూర్తి చేసింది సమంత. త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తను సొంతంగా స్థాపించిన బేనర్‌లో త్వరలోనే ఓ సినిమాను ఎనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే తను హీరోయిన్‌గా నటించబోయే సినిమాల తాలూకు వివరాలను కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.
![]() |
![]() |