![]() |
![]() |

తక్కువ వ్యవధిలోనే తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా ఇప్పుడు యానిమల్ తో హిందీ ప్రేక్షకుల మనసుని కూడా గెలుచుకుంది. పైగా ఆ మూవీతో అసలు సిసలు పాన్ ఇండియా నటిగా కూడా మారింది.లేటెస్ట్ గా ఆమె ఒక పెను ప్రమాదం నుంచి బయటపడింది.
రష్మిక ఇప్పుడు ముంబై లోనే ఉంటుంది. ఏ భాషకి సంబంధించిన సినిమా అయినా అక్కడనుంచే రాకపోకలు సాగిస్తుంది. ఇదే క్రమంలో ఒక మూవీ షూటింగ్ నిమిత్తం ముంబై నుంచి హైదరాబాద్ కి విమానంలో బయలుదేరింది. ఈ క్రమంలోనే ఆమె ప్రయాణిస్తున్న విమానం బయలు దేరిన కాసేపటికే అత్యవసరంగా మళ్ళీ ముంబైలోనే ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు రష్మిక కి టెన్షన్ తెప్పించాయి. సాంకేతిక లోపం వలన విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని తెలియడంతో ఆమె ఊపిరిపీల్చుకుంది. ఈ రోజు చావు నుంచి బయటపడ్డాను అంటు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ కూడా చేసింది.

విమానంలో రష్మిక తో పాటు ఇంకో ప్రముఖ హీరోయిన్ శ్రద్ద దాస్ కూడా ఉంది. ఆమె కూడా నేను రష్మిక చావు నుంచి తప్పించుకున్నాము అని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అలాగే విమానంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి దిగిన పిక్స్ ని కూడా షేర్ చేసింది. ఇప్పుడు ఈ పిక్స్ వైరల్ గా మారాయి. వాళ్ళు ప్రయాణిస్తున్న విమానం విస్తార కంపెనీ కి చెందినది. లాండింగ్ సమయంలో సుమారు 100 మంది దాకా విమానంలో ఉన్నారు. ఈ న్యూస్ విన్న చాలా మంది గతంలో విమాన ప్రమాదం జరిగి సౌందర్య చనిపోయిన విషయాన్నీ గుర్తు చేసుకున్నారు. అలాగే విస్తార లాంటి ప్రతిష్టాత్మక ఎయిర్ లైన్స్ సంస్థ నుంచి ఇలాంటి వార్త రావడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |