![]() |
![]() |

ఆయన పేరుకే తమిళ దర్శకుడు.కానీ తెలుగు వారికి సుమారు రెండు దశాబ్దాల పై నుంచే అభిమాన దర్శకుడు.పైగా భారతీయ సినిమా పరిశ్రమలో సోషల్ మెసేజ్ తో కూడిన సినిమాలు తీసే దర్శకుల్లో కూడా ఒకడు. ఆయన ఎవరో కాదు. ప్రముఖ కథకుడు దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్. ఆయన చిత్రాలు ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి. అలాగే చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ ని కూడా సృష్టించాయి.తాజాగా ఆయనకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
సుమారు నాలుగు సంవత్సరాల తర్వాత మురుగుదాస్ నూతన చిత్రం నేడు ప్రారంభం అయ్యింది. ప్రముఖ హీరో శివ కార్తికేయన్ హీరోగా సప్త సాగరాలు ధాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేస్తున్న ఆ మూవీకి మ్యూజిక్ సంచలనం అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా మురుగదాస్ ఈ విషయాన్ని తెలియచేసాడు. అలాగే ఆ మూవీ ఓపెనింగ్ ని సంబంధించిన ఫొటోస్ ని కూడా షేర్ చెయ్యడంతో ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ గా మారాయి.
గత కొన్ని నెలల నుంచి మురుగదాస్, శివ కార్తికేయన్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందనే రూమర్స్ వచ్చాయి.ఇప్పుడు ఆ రూమర్ నిజమయ్యింది. మురుగుదాస్ దర్శకత్వంలో చివరిగా రజినీ కాంత్ హీరోగా 2020 లో దర్బార్ మూవీ వచ్చింది.అంటే నాలుగేళ్ళ తర్వాత మురుగుదాస్ మళ్ళీ మెగా ఫోన్ ని పట్టుకున్నాడు. శివ కార్తికేయన్ కూడా తెలుగులో మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబోలో వచ్చే మూవీ తెలుగునాట చర్చినీయాంశమయ్యింది.
![]() |
![]() |